Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్‌లో త్వరలో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం విదితమే. ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్‌ల మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీ ఈ ఏడాది చివరి వరకు కంప్లీట్ అయితే తరువాత వచ్చే ఏడాది నుంచి మహేష్, రాజమౌళి మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ – రాజమౌళి మూవీకి ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆయన ఈ మధ్య ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మహేష్ మూవీ యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ జోనర్‌లలో ఉంటుందని.. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సినిమా కథ సాగుతుందని హింట్ ఇచ్చారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇక ఫ్యాన్స్ అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా.. ఎప్పుడు ఫస్ట్ అప్‌డేట్ వస్తుందా.. అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. అదేమిటంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్న మూవీ కోసం రాజమౌళి ఒక పవర్ ఫుల్ విలన్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. రాజమౌళి సినిమా అంటేనే విలన్ పాత్ర భయంకరంగా, దారుణంగా ఉంటుంది. కనుకనే సినిమాలు హిట్ అవుతుంటాయి. కాబట్టి ఒక స్ట్రాంగ్ విలన్ కోసం ఆయన వెదుకుతున్నారట. అందులో భాగంగానే పలువురు తమిళ స్టార్ హీరోల పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విక్రమ్, సూర్య లేదా ఆయన తమ్ముడు కార్తిలను రాజమౌళి సంప్రదిస్తున్నారట. వీరిలో ఎవరు విలన్‌గా నటిస్తారు.. అన్నది తెలియాల్సి ఉంది.
సూర్య ప్రస్తుతం హీరో క్యారెక్టర్లే చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. కనుక సూర్య విలన్‌గా చేయకపోవచ్చు. ఇక కార్తి, విక్రమ్ అంటే.. వీరికి హిట్ పడి చాలా రోజులు అవుతోంది. వీరు హీరోలు అన్న విషయాన్నే చాలా మంది మరిచిపోయారు. కనుక వీరు విలన్ పాత్రలో నటించేందుకు అంగీకారం తెలపవచ్చని సమాచారం. అయితే వీరేనా.. లేక ఇంకెవరినైనా రాజమౌళి సంప్రదిస్తున్నారా.. అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే త్వరలోనే ఈ మూవీకి సంబంధించి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…