Tamannaah : అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‌లు ప్రధాన పాత్రల్లో వస్తున్న మూవీ ఎఫ్3. ఎఫ్2 మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఈ నెల 27వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇక చిత్ర ప్రమోషన్స్‌ను కూడా వేగంగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రమోషన్ కార్యక్రమాల్లో తమన్నా తప్ప అందరూ కనిపిస్తున్నారు. కానీ ఆమె కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఎఫ్3 మూవీ ప్రమోషన్స్‌లో తమన్నా కనిపించడం లేదు. అయితే ఆమె కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉంది కదా.. అని అనుకోవచ్చు. కానీ ప్రమోషన్ చేయదలిస్తే ఆమె సోషల్ మీడియాలో అయినా సరే చిన్న వీడియో బిట్‌ను రిలీజ్ చేసి ఉండవచ్చు. కానీ తమన్నా కనీసం ఆ పని కూడా చేయడం లేదు. అంటే చిత్ర యూనిట్‌కు, తమన్నాకు మధ్య మనస్ఫర్థలు వచ్చాయని.. కనుకనే ఆమె చిత్ర ప్రమోషన్స్ చేయడం లేదని తెలుస్తోంది.
అయితే ఈ వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. అలాంటిదేమీ లేదని.. ఆమె కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉందని.. అందుకనే ఇక్కడికి రావడానికి.. ప్రమోషన్స్ చేయడానికి వీలు కలగడం లేదని చిత్ర యూనిట్ తెలియజేసింది. అయినప్పటికీ ఆమె కనీసం సోషల్ మీడియాలో అయినా ప్రమోషన్ చేయవచ్చు కదా.. అంత సమయం కూడా ఆమెకు లేదా.. అన్న ప్రశ్నకు మాత్రం చిత్ర యూనిట్ ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఈ క్రమంలోనే ఎఫ్3 యూనిట్‌కు, తమన్నాకు మధ్య వ్యవహారం బెడిసికొట్టిందనే వార్తలు నిజమేనని అంటున్నారు. కనుకనే ఆమె అసలు కనీసం సోషల్ మీడియాలోనైనా ఎఫ్3 మూవీ గురించి ప్రమోషన్ చేయడం లేదని అంటున్నారు. ఇక ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…