Raja Ravindra : హీరోలు 1, 2సార్లే.. హీరోయిన్లు మాత్రం ఒకేసారి 5, 6సార్లు.. రాజారవీంద్ర సంచ‌ల‌న కామెంట్స్‌..!

Raja Ravindra : ప్రముఖ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు రాజా రవీంద్ర. రాజా రవీంద్ర మొదట హీరోగా చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఈయన నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు పలువురు హీరోలకి మేనేజర్ గా కూడా వర్క్ చేశాడు. తెలుగులో నిఖిల్, నవీన్ చంద్ర, మంచు విష్ణు, రాజ్ తరుణ్ ఒకప్పుడు రవితేజ, స్టార్ హీరోస్ కి కూడా మేనేజర్ గా చేశాడు. రవితేజ రాజా రవీంద్ర వల్లే ఈ స్థాయిలో ఉన్నారటంలో సందేహం లేదు. ఎందుకంటే రవితేజ సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ రవితేజను గైడ్ చేస్తూ వచ్చాడు.

తర్వాత కొన్ని కారణాలతో వీరిద్దరికీ మ్యాటర్ చెడింది అని.. అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల రాజా రవీంద్ర ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశాడు. స్టార్ హీరోలకు మేనేజర్ గా ఉన్న మీరు హీరోయిన్లకు ఎందుకు భయపడిపోతారు ? హీరోయిన్లు మిమ్మల్ని మేనేజర్ గా అడిగితే నో చెప్పారట.. నిజమేనా ? అని యాంకర్ అడగ్గా.. రాజా రవీంద్ర మాట్లాడుతూ.. నేను హీరోలకి మేనేజర్ గా చేశాను.. కానీ, హీరోయిన్లకి ఎందుకు చేయడం లేదంటే దానికి కారణం సౌందర్య‌నే. హీరోలు 2,3 సినిమాలు ఓకే చేసి.. అవి కంప్లీట్ అయ్యాకే మిగతా సినిమాలకు వెళ్తారు. కానీ హీరోయిన్స్ మాత్రం ఒకేసారి 5,6 సినిమాలు ఓకే చేస్తారు.

Raja Ravindra

ఈ రోజు ఇక్కడ ఉంటే.. రేపు చెన్నైలో ఉండాలి అలా కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఫ్లైట్స్ డిలే అవుతాయి. ఒక సందర్భంలో సౌందర్య ఒకేసారి 3 సినిమాలు ఒప్పుకొని ఎంత ఇబ్బంది పడిందో కళ్లారా చూశాను. హిందీలో అమితాబచ్చన్ సినిమా.. తెలుగులో చిరంజీవి సినిమా.. తమిళ్ లో రజనీకాంత్ సినిమా.. మూడు సినిమాలను ఒకేసారి ఒకే చేసి ఆ టైంలో డేట్స్ సరిగ్గా అడ్జస్ట్ చేయలేక వాళ్ళ మేనేజర్ పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు. అది చూశాక నేను భవిష్యత్తులో ఎప్పుడూ హీరోయిన్స్ కి మేనేజర్ గా ఉండకూడదని నిర్ణయించుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో రాజా రవీంద్ర మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ల మేనేజర్లు ఇంత కష్టపడతారా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM