Naga Chaitanya : ఏ మాయ చేశావె సినిమాలో జంటగా నటించి నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి విడాకుల వార్తను సామ్ అభిమానులు, చైతూ అభిమానులు కూడా జీర్ణచుకోలేకపోయారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అభిమానులు భావిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది.
అయితే వీరి విడాకుల తర్వాత మరో అంశం తెరమీదకు వచ్చింది. నాగ చైతన్య సమంతను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకునే వాడు.. అనే ప్రశ్న చాలా మంది సినీ అభిమానులలో మెదులుతోంది. నాగ చైతన్య ప్రేమ విషయం ఇంట్లో తెలియక ముందు.. వారి కుటుంబ ఎవరితో నైనా సంబంధం కలుపుకోవాలని చూసిందా అని చాలామందికి అనుమానం వస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు వివిధ సందర్భాలలో అక్కినేని నాగర్జుననే సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పుడు మరొక సమాధానం చూద్దాం. టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్, ఏన్నార్ ఉన్నప్పటి నుంచే రెండు కుటుంబల మధ్య మంచి స్నేహం ఉండేది.
ఆ స్నేహం.. బాలయ్య, నాగార్జునల మధ్య కూడా కొనసాగింది. ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. రెండు కుటుంబాలు తప్పక హాజరు అయ్యేవారు. అయితే వీరి స్నేహాన్ని బంధుత్వంగా మలుచుకోవడానికి బాలయ్య, నాగర్జున రెడీ అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. బాలయ్య చిన్న కూతురిని నాగ చైతన్యకు ఇచ్చి వివాహం చేయాలని అప్పట్లో రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయని తెలిసింది. అయితే అప్పుడు నాగ చైతన్య సమంత లవ్ మ్యాటర్ చెప్పడంతో ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గారని సమాచారం. నాగ చైతన్య సమంతను లవ్ చేయకుంటే.. ప్రస్తుతం నందమూరి బాలయ్యకు అల్లుడిగా ఉండే వాడని పలువురు అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…