Rana Daggubati : టాలీవుడ్ ను శాసిస్తున్న కుటుంబాల గురించి అందరికీ తెలిసిందే.. అయితే సినిమాల విషయంలో ఆ కుటుంబాల మధ్య పోటీ ఉన్నప్పటికీ ఫ్యామిలీ మ్యాటర్ కి వచ్చేసరికి అంతా ఒక్కటే అన్నట్టు వరుసలు కలుపుకు తిరుగుతారు. అలా టాలీవుడ్‌లో అక్కినేని, నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీలది ఐదారు దశాబ్దాల అనుబంధం. ఈ మూడు కుటుంబాల మధ్య అనుబంధం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ మాటకు వస్తే ఏఎన్నార్ – రామానాయుడు ఏకంగా వియ్యంకులే అయ్యారు. అలాగే ఇటు దగ్గుబాటి, నందమూరి, నందమూరి, అక్కినేని ఫ్యామిలీ బంధాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే నందమూరి, దగ్గుబాటి వంశాల్లో మూడో తరం హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రానా కొనసాగుతున్నారు.
బాహుబలితో రానా, ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. వీరిద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అయినప్పటికీ ఎక్కడా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం, ఈగోలకి వెళ్లడం లాంటివి ఎప్పుడు చేయలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నారని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్ తీవ్రంగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్, రానా సింపుల్ గా ఉండడంతో వీరి ఫ్యాన్స్ కూడా వివాదాలకు దూరంగా ఉన్నారు. అయితే వ్యక్తిగతంగా రానా, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ అని మనకు తెలిసిందే. అంతేకాదు ఒకరినొకరు బావ, బావ అని పిలుచుకుంటూ ఉంటారు. సురేష్‌బాబును ఎన్టీఆర్ ముద్దుగా మావా అని పిలుస్తుంటాడు.
ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌కు ఓసారి రామ్‌చరణ్ గెస్ట్ గా వచ్చాడు. ఫోన్ ఇన్ ఫ్రెండ్ కాల్‌కు చరణ్ రానాకే ఫోన్ చేశాడు. ఫోన్ కలిసిన వెంటనే రానా, ఎన్టీఆర్ ఒకరినొకరు బావ, బావ అని పిలుచుకున్నారు. బావ మీ ఎపిసోడ్ మేకింగ్ వీడియో ఏకంగా 10 సార్లు చూశానని.. తాను మెస్మరైజ్ అయిపోయానని రానా చెప్పగా.. వెంటనే తారక్ థ్యాంక్యూ బావా అని రానాకు అప్యాయంగా చెప్పాడు. ఇక బయట కూడా రానా, ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య మంచి రిలేషన్ ఉండడం వల్ల ఫ్యాన్స్ కూడా బాగా ఖుషి అవుతున్నారు. పాన్ ఇండియా హీరోలైనప్పటికీ ఒద్దికగా ఉండి, మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నందుకు రానా, ఎన్టీఆర్ లను అభినందించాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…