Radhe Shyam : ప్రభాస్, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా నటించిన రాధే శ్యామ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి విడుదల కావల్సి ఉన్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఫ్యాన్స్‌కు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఎప్పటి నుంచో రాధే శ్యామ్ విడుదల కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ ఎట్టకేలకు విడుదలవుతుండడం వారికి అంతులేని ఆనందాన్ని అందిస్తోంది.
రాధే శ్యామ్ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని, ఓటీటీలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఈ మూవీని మార్చి 11, 2022వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున ఇక సినిమాను ఆపడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని, కనుక ఎట్టి పరిస్థితిలోనూ మార్చి 11న ఈ సినిమాను విడుదల చేయాల్సిందేనని ప్రభాస్ కచ్చితంగా చెప్పేశారట. అందుకని మేకర్స్ ఆ తేదీని లాక్ చేసేశారు. దీంతో ఆ తేదీన కచ్చితంగా మూవీ విడుదల అవుతుందని తెలుస్తోంది.
కాగా రాధే శ్యామ్ విడుదల తేదీపై ప్రభాస్‌తోపాటు టి-సిరీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు తీవ్రంగా చర్చించారు. గతంలోనూ ఈ మూవీ విడుదలపై అనేక సందేహాలు నెలకొనగా.. వాటిని మేకర్స్ పటాపంచలు చేసేశారు. ఎట్టేకలకు రాధే శ్యామ్ విడుదల అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మార్చి 11వ తేదీ సమయంలో ఎలాంటి పాన్ ఇండియా సినిమాలు విడుదల కావడం లేదు. దీంతో ఆ తేదీ కలసి వస్తుందని రాధే శ్యామ్ మేకర్స్ భావిస్తున్నారు. ఢిల్లీలోనూ కర్ఫ్యూను ఎత్తివేశారు. అటు ఏపీలో ఫిబ్రవరి నెలలో సినిమా థియేటర్ల టిక్కెట్ల ధరలపై ఒక స్పష్టత వస్తుంది. కనుక అన్ని విధాలుగా మార్చిలో సినిమాను విడుదల చేయడమే కరెక్ట్ అని రాధే శ్యామ్ మేకర్స్ భావించారు. కనుక మార్చి 11 డేట్‌ను సినిమా విడుదలకు లాక్ చేసేశారు.
కాగా రాధే శ్యామ్ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిచారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్స్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమా హిట్ పక్కా.. అని భావిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…