Pushpa Movie : కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్‌ని మాస్ లుక్ లో చూపిస్తూ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్నాడు. సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో ఆర్య, ఆర్య 2 చిత్రాలు తెరకెక్కగా.. ఇవి మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు పుష్ప చిత్రం రూపొందుతోంది. డిసెంబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. తాజాగా చిత్రం నుండి నాలుగో పాటను విడుదల చేశారు.
మాస్ ఫీస్ట్ సాంగ్ “ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా” అంటూ విడుదలైన పాట తెలుగు వెర్షన్‌ను నకాష్ అజీజ్ పాడగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు. అభిమానుల అంచనాలను అందుకునేలా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ తెగ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు మూడు సింగిల్స్ ‘దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి’ సాంగ్స్ విడుదల కాగా, ఈ పాటలన్నీ హిట్ అయ్యాయి.
ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటలో అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తున్నాడు. ఇందులో బన్నీ వేసే స్టెప్స్ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ బన్నీ లుక్ షాక్ కలిగిస్తోంది.
పుష్ప చిత్రంలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా, ఫాహద్ ఫజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నటి సమంత సైతం ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో ఆడి పాడనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…