Most Eligible Bachelor : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డె జంటగా నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ మూవీ అక్టోబర్ 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ శుక్రవారం నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.
బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీని తెరకెక్కించగా.. ఎన్నో ఆటుపోట్ల మధ్య ఎట్టకేలకు దసరా కానుకగా ఈ మూవీని విడుదల చేశారు. అఖిల్‌కు కెరీర్‌లో ఇప్పటి వరకు చెప్పుకునేందుకు హిట్లు లేవు. ఆ ఆకలిని ఈ మూవీ తీర్చేసిందని చెప్పవచ్చు. ఎట్టకేలకు అఖిల్ ఖాతాలో ఓ హిట్ మూవీ వచ్చి చేరింది. ఇక ఈ మూవీని ప్రస్తుతం ఆహాలో వీక్షించవచ్చు.
ఈ మూవీ విడుదలై నెల రోజులు దాటిన నేపథ్యంలో దీన్ని ఓటీటీలో విడుదల చేశారు. థియేటర్లకు వెళ్లిన వారు ఈ మూవీని ఇంట్లోనే ఆహా ఓటీటీలో చూడవచ్చు. కాగా ఓ ఎన్ఆర్ఐ ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకోవాలని చూస్తుంటాడు. అంతలోనే లవ్‌లో పడతాడు. అద్భుతమైన కామెడీతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే అఖిల్, పూజా హెగ్డెల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అయింది.
ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీకి చెందిన పాటలు కూడా ప్రేక్షకులకు బాగానే ఎక్కాయి. ఈ మూవీని ఆహాలో విడుదల చేస్తున్నట్లు కొన్ని రోజుల కిందటే ప్రకటించారు. చెప్పిన విధంగానే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.
ఇక అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే మూవీతో బిజీగా ఉండగా.. పూజా హెగ్డె ఆచార్యలో రామ్ చరణ్ పక్కన నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మాల్దీవ్స్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ అద్భుతమైన ఫొటోలను షేర్ చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…