Bigg Boss 5 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫైనల్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ షోపై మరింత ఆసక్తి పెరుగుతోంది. వారం వారం కంటెస్టెంట్ల సంఖ్య తగ్గుతుండడంతో.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల మధ్య పోటీ పెరుగుతోంది. వారందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో.. పోటీ బాగానే ఉంది. వారికి సోషల్ మీడియాలో ఫాలోవర్లు బాగా ఉన్నందున ఓట్లు బాగానే పడుతున్నాయి. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా షోను వీక్షిస్తున్నారు.
అయితే తాజాగా ఓ ఎపిసోడ్‌లో సిరి, షణ్ముఖ్‌ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వారిద్దరూ ఓ సందర్భంలో లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్నారంటూ.. సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ అవుతున్నాయి. ఓ సమయంలో సిరి తన లిప్ స్టిక్‌తో ఐ హేట్ యు అని రాసి షణ్ముఖ్‌కి ఇస్తుంది. దీంతో తనను అసహ్యించుకోవడానికి గల కారణం ఏమిటి ? అని షణ్ముఖ్ అడిగాడు.
అయితే తరువాత ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకుని కనిపించారు. ఈ క్రమంలోనే సిరి.. షణ్ముఖ్‌కు లిప్ టు లిప్ కిస్ ఇచ్చిందని కొందరు ప్రేక్షకులు అంటున్నారు. కానీ కెమెరా యాంగిల్ వల్ల వారు అలా లిప్ టు లిప్ ఇచ్చుకున్నట్లు కనిపించిందని.. అంతకు తప్ప వేరే ఏమీ లేదని.. అయినా వారు ఇది వరకే వేరే వ్యక్తులతో లవ్‌లో ఉన్నారు.. వారు అలా చేయరు.. అని కొందరు అంటున్నారు.
కాగా.. వారిద్దరి హగ్ సీన్‌కు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు సినీ నటి మాధవీ లత ఈ వీడియోపై స్పందించారు. బిగ్ బాస్ హౌస్ నుంచి అలాంటి వీడియోలు తనకు వచ్చాయని.. కానీ తాను వాటిని షేర్ చేయదలుచుకోలేదని.. అది సభ్యత అనిపించుకోదని.. ఆమె అన్నారు.
కాగా షణ్ముఖ్ ఇప్పటికే దీప్తి సునయనతో లవ్‌లో ఉండగా.. సిరి శ్రీహాన్ తో రిలేషన్ షిప్‌ను మెయిన్‌టెయిన్ చేస్తోంది. ఈ క్రమంలో షోలో రొమాంటిక్ సీన్స్ మరీ పెరిగిపోవడంతో.. కొందరు ఈ షో నిర్వాహకులపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…