Venkatesh : సీనియర్ హీరో వెంకటేష్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. ఆయన నటించిన సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. రీసెంట్‌గా ‘నారప్ప’ సినిమాతో అలరించిన విక్టరీ వెంకటేష్.. నవంబర్ 25న ‘దృశ్యం 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ చేపట్టిన వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ.. తన కెరీర్‌కి సంబంధించిన పలు విషయాలపై ఓపెన్ అయ్యారు.
వెంకటేష్ సినిమాలు ఇటీవల వరుసగా ఓటీటీలో విడుదల కావడంపై స్పందించిన వెంకీ.. సినిమా చేయడం వరకే నా బాధ్యత. విడుదల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోను. ఇది తప్పు, అది ఒప్పు అనేమీ ఉండదు. పరిస్థితులకి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి.
ఇంకా థియేటర్‌కి రాని కుటుంబ ప్రేక్షకులు దీన్ని ఓటీటీ వేదికల ద్వారా చూడొచ్చనుకున్నాం. థియేటర్లలో విడుదల కాలేదని నా అభిమానులు బాధ పడుతుండొచ్చు కానీ.. భవిష్యత్తులో నా సినిమాలు థియేటర్లలోనే విడుదలవుతాయని అన్నారు.
ఇక తదుపరి సినిమాల గురించి మాట్లాడిన ఆయన ప్రస్తుతానికైతే ఇంకా ఓకే చెప్పలేదు. కథలు వచ్చినప్పుడు చేద్దాం, లేనప్పుడు ఖాళీగా ఉందాం. ప్రపంచం తిరుగుదాం, ధ్యానం చేద్దాం. అందరూ బాగుండాలని కోరుకుందాం. దానికంటే ఏం ఉంటుంది.. అని అన్నారు. ప్రస్తుతానికి రానాతో కలిసి ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ ప్రాజెక్టు ఒక దానిలో నటిస్తున్నా. అవకాశం వచ్చినప్పుడు దానికోసం 100 శాతం కష్టపడదాం అని చెప్పుకొచ్చారు. కాగా వెంకటేష్ లాంటి స్టార్ హీరోకి సినిమాలు లేవు.. అనే సరికి అందరూ షాక్ అవుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…