Pushpa 2 Movie : గడిచిన 2021 ఏడాదికి గాను పుష్ప – ది రైజ్ మూవీ బిగ్గెస్ట్ గ్రోసర్‌గా నిలిచింది. ఈ మూవీకి హిందీలో పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అయినప్పటికీ అక్కడ సర్ ప్రైజ్ హిట్ సాధించింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ తమిళం, మళయాళం, కన్నడ వెర్షన్లలోనూ విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఓ వైపు ఇంకా పుష్ప మొదటి పార్ట్ సక్సెస్‌ను మరిచిపోకముందే పుష్ప 2 మూవీ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ పుష్ప మేకర్లకు భారీ డీల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2 అన్ని భాషలకు చెందిన థియేటర్, ఓటీటీ, శాటిలైట్ హక్కులకు గాను ఏకంగా రూ.400 కోట్లు చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో ఏ మూవీకి ఈ రకమైన ఆఫర్ రాలేదు. దీంతో ఈ ఆఫర్ భలే టెంప్టింగ్‌గా ఉందని పలువురు అంటున్నారు.
అయితే ఆ ఆఫర్‌ను మైత్రి మూవీ మేకర్స్ వారు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. పుష్ప 2 మూవీ ఇంకా పెద్ద హిట్ అవుతుందని, హిందీ మార్కెట్ ఓపెనింగ్స్‌ను కొల్లగొడుతుందని భావిస్తున్నారు. ఈ మూవీ తమిళనాడు, కర్ణాటక, కేరళలోనూ మంచి విజయం సాధించింది. అక్కడ అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 సక్సెస్ అవుతుందని మేకర్స్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఇక హిందీలోనూ పుష్ప 2 మూవీ మంచి విజయం సాధించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పుష్ప మొదటి పార్ట్ భారీ హిట్‌గా నిలిచింది. దీంతో రెండో పార్ట్ మరింత సులభంగా విజయం సాధిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రస్తుతం రెండో పార్ట్‌ను చిత్రీకరించే పనిలో పడ్డారు.
దర్శకుడు సుకుమార్ ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. పుష్ప 2 మూవీపై భారీ అంచనాలు ఉన్నాయని తెలిపారు. మరి పుష్ప 2 ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…