Puneeth Rajkumar : కన్నడ పవర్‌స్టార్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త ఆయన అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది. ఆయన రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరోయే. ఎంతో మందిని చేరదీసి ఆశ్రయం ఇస్తున్నారు. మరెంతో మందిని దత్తత తీసుకుని చదువు చెప్పిస్తున్నారు. అలాంటి ఆయన హఠాన్మరణం ఎంతో మందిని శోక సంద్రంలో నింపింది.
పునీత్ రాజ్ కుమార్ ఎల్లప్పుడూ వ్యాయామం చేస్తుంటారు. అందులో భాగంగానే జిమ్‌లో ఎక్కువగా గడుపుతుంటారు. ఫిట్ నెస్‌కు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఫిట్‌గా ఉంటారు. అయితే ఆయన జిమ్ చేస్తూనే కుప్పకూలి పడిపోయి.. అనంతరం హాస్పిటల్‌లో చేరి.. కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు. దీంతో ఆయన మరణవార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎల్లప్పుడూ ఫిట్‌గా కనిపించే ఆయన ఇలా గుండెపోటుతో చనిపోవడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
కాగా పునీత్ రాజ్ కుమార్ చేసిన చివరి ట్వీట్ ఏది ? అంటూ నెటిజన్లు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పునీత్ ద్విత్వ అనే మూవీలో నటిస్తుండగా.. ఆయన సోదరుడు శివరాజ్ కుమార్ నటించిన భజరంగి 2 చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఆయన చివరిసారిగా ట్వీట్ చేశారు. దీంతో పునీత్ చివరి ట్వీట్ వైరల్‌గా మారింది. ఏది ఏమైనా.. ఆయన ఆకస్మిక మరణం మాత్రం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…