Pawan Kalyan : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లు ప్రధాన పాత్రల్లో తమిళ చిత్రం వినోదయ సీతమ్‌ను రీమేక్ చేయనున్న విషయం విదితమే. దీనికి నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ ఇప్పటికే ప్రారంభం కావల్సి ఉంది. కానీ పవన్ పొలిటికల్ టూర్ వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఈ మూవీ లాంచింగ్‌ను ఈనెల 21వ తేదీకి వాయిదా వేశారు. దీంతో చిత్ర నిర్మాతల్లో ఆందోళన నెలకొంది.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ఓడాక మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. అలా వచ్చాక తీసిందే భీమ్లా నాయక్. ఈ మూవీ షూటింగ్ కూడా అనేక సార్లు వాయిదా పడింది. కరోనా వల్ల మరింత ఆలస్యం అయింది. అలాగే హరిహర వీరమల్లు చిత్రాన్ని 2 ఏళ్ల నుంచి తీస్తూనే ఉన్నారు. ఈ మూవీ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా వినోదయ సీతమ్ రీమేక్ కూడా మొదటి రోజే వాయిదా పడింది. ఇలా వాయిదా పడుతుండడం వల్ల నిర్మాతలకు తీవ్రమైన నష్టం కలుగుతోంది. దీని వల్ల పవన్‌తో సినిమా తీద్దామంటేనే నిర్మాతలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే ఇందులో పవన్ తప్పేమీ లేదు. ఎందుకంటే ఆయన సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. అలాగే తనకు వేరే ఆర్థిక వనరులు ఏవీ లేవని.. సినిమాలతో వచ్చే ఆదాయంతోనే రాజకీయాల్లో పనులు చేస్తున్నానని.. కనుక తన సినిమాలను చూడాలని ఆయన గతంలోనే కోరారు. ఇక ప్రస్తుతం ముందస్తు ఎన్నికల హడావిడి నడుస్తుండడంతో ఆయన ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. అందువల్లే సినిమాల షూటింగ్‌లు వాయిదా పడుతున్నాయి. ఏది ఏమైనా.. పవన్ తో సినిమాలు చేద్దామని అనుకునే నిర్మాతలు ఆయన పొలిటికల్ షెడ్యూల్‌ను కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే నష్టాలను భరించక తప్పదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…