Dil Raju Son Name : ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇటీవలే మరోసారి తండ్రి అయిన విషయం విదితమే. తన రెండో భార్య తేజస్విని అలియాస్ వైగా రెడ్డి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కరోనా టైమ్ లో 2020 మే నెలలో వీరు వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ సమయం కావడంతో సినీ ప్రముఖులు, స్నేహితులు లేకుండానే కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. దీంతో అప్పట్లో వైగా రెడ్డి ఫొటోలు వైరల్ అయ్యాయి.
కాగా మొదటి భార్య అనిత రెడ్డి చనిపోవడంతో కుమార్తె హర్షిత రెడ్డి బలవంతం మేరకు దిల్ రాజు మరో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవలే పండంటి మగ బిడ్డను పొందారు. హాస్పిటల్‌లో ఆయన తన కొడుకుని ఎత్తుకుని మురిసిపోతున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే త్వరలోనే తన కొడుక్కి పేరు పెట్టే ఫంక్షన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన తన కొడుక్కి ఓ పేరును కూడా ఎంపిక చేశారని సమాచారం.
తన మొదటి భార్య అనిత రెడ్డి పేరులోని మొదటి రెండు అక్షరాలు An, రెండో భార్య వైగా రెడ్డి పేరులోని మొదటి రెండు అక్షరాలు vy కలిపి Anvy Reddy అని తన కొడుక్కి దిల్ రాజు పేరు పెట్టబోతున్నారట. ఈ విషయం ప్రస్తుతం ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ పేరు తన భార్య వైగా రెడ్డికి చెప్పగా ఆమె అందుకు ఓకే చెప్పిదంట. దీంతో అన్వి రెడ్డి అనే పేరునే తన కొడుక్కి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రెడ్డి అనే కులం ట్యాగ్‌ను ప్రదర్శించుకోవడానికి ఇష్టపడని దిల్ రాజు కొడుక్కి మాత్రం అదే విధంగా పేరు పెడుతుండడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…