Kamal Haasan : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమలహాసన్, ఫహాద్ ఫాసిల్, విజయ్ సేతుపతి, సూర్య ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ.. విక్రమ్. ఈ మూవీ జూన్ 3, 2022వ తేదీన రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద సునామీలా వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో స్ట్రీమ్ అవుతోంది. అయితే థియేటర్లతోపాటు ఓటీటీలోనూ ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఓటీటీలోనూ ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. విక్రమ్ సినిమా కమల హాసన్ సినిమా కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా నిలిచింది.
కాగా విక్రమ్ సినిమాకు రూ.120 కోట్ల మేర బడ్జెట్ అయినట్లు సమాచారం. ఈ మూవీకి ఇప్పటి వరకు మొత్తం రూ.442 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో షేర్ రూ.80 కోట్లు కాగా.. పన్నులు అవి పోతే.. మొత్తం రూ.176 కోట్ల వరకు నిర్మాతలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని నిర్మించింది స్వయంగా కమల్ హాసనే. ఆయన రెమ్యునరేషన్ ఏమీ తీసుకోలేదు. సొంతంగా నిర్మించారు. కనుక వచ్చే మొత్తం లాభాలు ఆయనకే వెళ్తాయి. కనుక ఈ మూవీ ఆయనకు లాభాల పంటను పండించిందని చెప్పవచ్చు. ఎంతలేదన్నా ఈ సినిమాతో ఆయన రూ.150 కోట్లు అయినా వెనకేసుకుని ఉంటారని సమాచారం. దీంతో తన అప్పులన్నీ తీరిపోతాయని ఇది వరకే ఆయన చెప్పారు. అలా ఒకే ఒక్క మూవీతో హిట్ కొట్టిన కమలహాసన్ తన అప్పులను తీర్చుకోవడమే కాదు.. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు.
ఇక విక్రమ్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. సినిమా విజయం సాధించడంలో మ్యూజిక్‌దే ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. ఈ మూవీలో వచ్చే పీక్ సన్నివేశాల్లో అదరహో అనిపించేలా అనిరుధ్ సంగీతం అందించారు. అయితే దీనికి సీక్వెల్‌గా విక్రమ్ 2ను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…