Number One Movie : సూపర్ స్టార్ కృష్ణ తన సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. కెరీర్ తొలినాళ్లలో ఈయన వరుస చిత్రాల్లో దూసుకుపోయారు. ఒక ఏడాదిలో అయితే ఏకంగా 18 చిత్రాలు తీసి రికార్డు సృష్టించారు. అంతేకాదు.. తొలి కలర్ సినిమా తీసింది, తొలి గూఢచారి సినిమా, తొలి కౌబాయ్ సినిమా తీసింది కూడా ఈయనే. ఈ క్రమంలోనే కృష్ణ అప్పట్లో అన్నింట్లోనూ నంబర్ వన్‌గా ఉన్నారు. అయితే ఇదే పేరుతో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కృష్ణతో కలిసి నంబర్ వన్ అనే మూవీని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ అప్పట్లో కృష్ణకు మళ్లీ లైఫ్ ఇచ్చింది. ఎన్నో ఫ్లాప్‌లతో సతమతం అవుతున్న కృష్ణ నంబర్ వన్ మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు.
రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఎస్వీ కృష్ణా రెడ్డి 1993లో మాయలోడు చేస్తున్న రోజులవి. ఈ క్రమంలోనే ఒక రోజు కృష్ణ ఆ షూటింగ్‌కు హాజరయ్యారు. షూటింగ్ గ్యాప్‌లోనే కృష్ణకు ఎస్వీ కృష్ణారెడ్డి నంబర్ వన్ కథను వినిపించారు. కొన్ని లైన్స్ వినగానే కృష్ణ ఇక ఏమాత్రం అడ్డు చెప్పకుండా వెంటనే సినిమాకు ఓకే చెప్పారు. అలా నంబర్ వన్ మూవీకి అక్కడ బీజం పడింది.
తరువాత షిరిడీ సాయి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో నంబర్ వన్ మూవీ తెరకెక్కింది. 1994లో దీన్ని రిలీజ్ చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ అప్పట్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఏకంగా రూ.6 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీ కృష్ణ కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
అయితే అప్పట్లో ఈ మూవీకి నంబర్ వన్ అని టైటిల్ పెట్టడంపై విమర్శలు వచ్చాయి. ఎంతో మంది హీరోలు ఉండగా కృష్ణ ఎలా నంబర్ వన్ అవుతారు.. అంటూ ప్రశ్నించారు. కానీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ విమర్శలకు సున్నితంగా సమాధానం చెప్పారు. తాము హీరోలు నంబర్ వన్నా కాదా.. అని సినిమా తీయలేదని.. తండ్రి తరువాత కుటుంబంలో బాధ్యతలను మోసే ప్రతి ఒక్కరూ నంబర్ వన్నే అని ఆయన కౌంటర్ ఇచ్చారు. దీంతో విమర్శలు సద్దుమణిగాయి. ఏది ఏమైనా నంబర్ వన్ మూవీ మాత్రం కృష్ణ కెరీర్‌లో హిట్ సినిమాల్లో ఒకటిగా మిగిలిపోయిందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…