Priyamani : పుష్ప సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నలకు ఎంత పేరు వచ్చిందో.. కేవలం ఒక్క పాట చేయడం ద్వారా సమంతకు కూడా అంతే పేరు వచ్చింది. శ్రీవల్లి సాంగ్‌తోపాటు సమంత ఊ అంటావా.. పాట కూడా పాపులర్ అయింది. ఇప్పటికే సమంత పాటకు ఎంతో మంది డ్యాన్సులు చేశారు. అయితే ఈ పాటపై ప్రియమణి తాజాగా స్పందించింది.

ఊ అంటావా పాటలో సమంతను చూస్తే తాను, తన భర్తకు ఆమె హాట్‌గా ఉందని అనిపించిందని.. ప్రియమణి తెలియజేసింది. అయితే తామిద్దరికే కాదు, ఎవరికైనా ఆ పాటలో సమంతను చూస్తే అలాగే అనిపించి ఉంటుందని ప్రియమణి అభిప్రాయ పడింది. సమంత ఆ పాటలో అద్భుతంగా చేసిందని, గతంలో ఆమె ఏ సినిమాలోనూ ఆ విధంగా చేయలేదని.. ప్రియమణి కితాబిచ్చింది.
Priyamani : దేవిశ్రీప్రసాద్‌కు హ్యాట్సాఫ్..
ఇప్పటికే చాలా మంది రోజూ ఊ అంటావా.. పాటను వీక్షిస్తున్నారని ప్రియమణి తెలిపింది. అంతటి అద్భుతమైన సాంగ్‌ను కంపోజ్ చేసినందుకు దేవిశ్రీప్రసాద్‌కు హ్యాట్సాఫ్ అని తెలిపింది. ఈ పాటలో కొరియోగ్రఫీ కూడా అద్భుతంగా ఉందని, సమంత చాలా అందంగా, హాట్‌గా కనిపించిందని చెప్పింది. కాగా ప్రియమణి తాజాగా నటించిన భామాకలాపం సినిమా త్వరలోనే ఆహాలో స్ట్రీమ్ కానుంది.