Anasuya Bharadwaj : బుల్లితెర యాంకర్‌గానే కాదు.. సినిమాల్లోనూ అనసూయ రాణిస్తోంది. అలాగే టీవీ షోలు, యాంకరింగ్ ఈవెంట్లతోనే ఈమె బిజీగా ఉంది. ఇటీవలే ఆమె పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో కనిపించి అలరించింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే. కానీ రెండో పార్ట్‌లో అధిక భాగం కనిపిస్తుందని సమాచారం.

ఇక అనసూయ రవితేజ చిత్రం ఖిలాడిలో ద్విపాత్రాభినయంలో కనిపించనుందని తెలుస్తోంది. అందులో ఒక పాత్రగా ఆమె బ్రాహ్మణ యువతిగా కనిపించనుందని సమాచారం. మరోపాత్ర ఎలా ఉంటుందనే వివరాలు ఇంకా తెలియలేదు.
Anasuya Bharadwaj : పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర..
అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఈ రెండు పాత్రల్లో ఒక పాత్ర చనిపోతుందని తెలుస్తోంది. ఒక పాత్ర మాత్రమే తెరపై కనిపిస్తుందని సమాచారం. ఈ సినిమాలో అనసూయది పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర అని తెలుస్తోంది. ఖిలాడి సినిమాతో అనసూయ సినిమా కెరీర్ ఒక్కసారిగా మారిపోతుందని అంటున్నారు.
కోనేరు హవీష్ నిర్మాణంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమాను రమేష్ వర్మ తెరకెక్కించారు. ఇందులో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.