Praseeda : యంగ్ రెబల్ స్టార్ గా తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టిన ప్రభాస్ ఆరంభంలోనే మంచి హిట్లు కొట్టారు. ఈశ్వర్ సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఆయన సినిమాల్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే అనేక చిత్రాల్లో నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బాహుబలి మూవీలతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలనే తీస్తున్నారు. అయితే ప్రభాస్‌కు సోదరి కూడా ఉంది. ఆమె ప్రసీద.
ప్రభాస్ సోదరి ప్రసీద రాధేశ్యామ్ మూవీకి పనిచేసింది. విదేశాల్లో ఈమె చదువుకోగా.. సినిమా నిర్మాణ పనులను ఈమె పర్యవేక్షిస్తోంది. రాధేశ్యామ్ కు కూడా అలాగే ఈమె పనిచేసింది. యూవీ క్రియేషన్స్‌లో ఫిలిం ప్రొడక్షన్‌కు సంబంధించిన పనులు చూసుకుంటోంది. ఇక ప్రభాస్ సోదరి ప్రసీద చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ప్రసీద ఇటీవలే ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ను ఆర్డర్ చేసింది. అయితే ఫుడ్ ను చాలా ఆలస్యంగా తేవడమే కాకుండా చాలా నాసికరమైన ఆహారాన్ని అందించారని తెలిపింది. ఇదే విషయమై సదరు యాప్ ప్రతినిధులను సంప్రదిస్తే తమకు ఏమీ తెలియదని వారు సమాధానం చెప్పారని.. ఆమె తెలియజేసింది. దీంతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె సోషల్ మీడియాలో తెలియజేసింది. ఈ క్రమంలోనే ప్రసీద పోస్ట్ వైరల్ అవుతోంది.