Harbhajan Singh : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ ఇటీవలే ముగిసింది. ఈ క్రమంలోనే ఈసారి టోర్నీ విజేతగా కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ (జీటీ) నిలిచింది. ఆడిన తొలి సీజన్‌లోనే ట్రోఫీ సాధించిన జట్ల జాబితాలో జీటీ చేరింది. ఇక ఈ సారి సీజన్‌లో పెద్దగా వివాదాలు ఏమీ అవలేదు. కానీ గతంలో పలు సీజన్లలో ఐపీఎల్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా అప్పట్లో జరిగిన స్లాప్ గేట్ వివాదం పెను దుమారాన్నే సృష్టించింది. 2008 ఐపీఎల్‌లో హర్భజన్ సింగ్.. శ్రీశాంత్‌ను చెంప దెబ్బ కొట్టడం సంచలనం సృష్టించింది. అయితే ఆ తరువాత భజ్జీ జరిగిన దానికి సారీ చెప్పాడు. కానీ అప్పటికే బీసీసీఐ అతనిపై చర్యలు తీసుకుంది. అయితే ఈ వివాదంపై తాజాగా భజ్జీ స్పందించాడు. ఇంతకీ అతను ఏమన్నాడంటే..
2008 ఐపీఎల్‌లో హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. అదే సీజన్‌లో శ్రీశాంత్ పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. అయితే మ్యాచ్ సందర్భంగా హర్భజన్‌ను శ్రీశాంత్ పదే పదే విమర్శించాడు. భజ్జీపై శ్రీశాంత్ పదే పదే కామెంట్లు చేశాడు. దీంతో భజ్జీ విసిగిపోయాడు. సహనం కోల్పోయాడు. మ్యాచ్ అనంతరం ఇరు జట్లకు చెందిన ప్లేయర్లు ఒకరికొకరు హ్యాండ్ షేక్‌లు ఇచ్చుకున్నారు. అయితే భజ్జీ, శ్రీశాంత్‌లు కరచాలనం చేసే సమయంలో.. భజ్జీ శ్రీశాంత్‌ను చెంప దెబ్బ కొట్టాడు. అయితే ఈ సంఘటన అక్కడి కెమెరాల్లో రికార్డు కాలేదు. కానీ చెంపదెబ్బ అనంతరం శ్రీశాంత్ ఏడుస్తూ కనిపించాడు. దీంతో ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

అయితే ఇలా చేసినందుకు గాను ఆ ఐపీఎల్ సీజీన్ మొత్తానికి బీసీసీఐ భజ్జీని బ్యాన్ చేసింది. తరువాత భారత్ తరఫున భజ్జీ ఆడే 5 వన్డే మ్యాచ్‌లకు కూడా అతనిపై నిషేధం విధించారు. తరువాత కొంత కాలానికి భజ్జీ శ్రీశాంత్‌కు సారీ చెప్పాడు. కానీ తరచూ దీనిపై భజ్జీ స్పందిస్తూనే ఉన్నాడు. తాజాగా ఇదే విషయంపై మరోమారు భజ్జీ మాట్లాడుతూ.. తాను అలా చేసి ఉండకూడదని.. తప్పు చేశానని.. శ్రీశాంత్‌ను కొట్టడం తప్పేనని అన్నాడు. దాని వల్ల తన టీమ్ సభ్యులు ఎంతో ఇబ్బంది పడ్డారని అన్నాడు. అలాంటి సంఘటన ఇక జరగకూడదని కోరుకున్నానని అన్నాడు. అసలు తాను అలా చేసి ఉండకూడదని అన్నాడు.
ఇక హర్భజన్ సింగ్ డిసెంబర్ 2021లో క్రికెట్‌కు గుబ్‌బై చెప్పగా.. భజ్జీ మొత్తం 367 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 711 వికెట్లు తీశాడు. అలాగే శ్రీశాంత్ మార్చి 2022లో రిటైర్ అయ్యాడు. ఇతను 90 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 169 వికెట్లు తీశాడు.