Maa Elections : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అభ్యర్థులు ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఇంకా ఎన్నికలకు ఒక్క రోజు మాత్రమే ఉండడంతో మా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే సినీ వర్గాల్లో నడుస్తున్న చర్చ ప్రకారం.. మా ఎన్నికల రేసులో ప్రకాష్ రాజ్ వెనుకబడ్డారని తెలుస్తోంది. ఎందుకంటే ఇండస్ట్రీ పరంగా ఇప్పటికే ప్రకాష్ రాజ్‌పై కొన్ని మచ్చలున్నాయి. ఆయన సమయానికి రాడని, ఫైనాన్షియర్లకు డబ్బులు ఎగ్గొట్టారని అంటున్నారు. మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ప్రకాష్ రాజ్ కు చెందిన ఈ విషయాలను ప్రత్యక్షంగా నిరూపించారు కూడా.
అయితే విష్ణుకు సంబందించి రిమార్క్‌లను ఎత్తి చూపడంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ విఫలమైందని చెప్పవచ్చు. ఇక సీనియర్లు, సినీ ఇండస్ట్రీల పెద్దల మద్దతును కూడగట్టడంలోనూ ప్రకాష్ రాజ్ విఫలమయ్యారు. ఆయన వారి మద్దతు అవసరం లేదని బహిరంగంగానే చెప్పారు. కానీ మంచు విష్ణు మాత్రం అందరు పెద్దలనూ కలసి మద్దతు సాధించారు.
ఈ విధంగా అనేక కారణాల వల్ల ప్రకాష్ రాజ్ మా ఎన్నికల రేసులో వెనుక బడ్డారని చెప్పవచ్చు. అయితే ఎన్నికలు జరిగితే కానీ ఎవరి భవితవ్యం ఏమిటి ? అనేది తేలదు. అందుకు ఇంకో 48 గంటల పాటు వేచి చూడాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…