Doctor Movie Review : తమిళ సినీ ఇండస్ట్రీలో నటుడు శివకార్తికేయన్‌కు మంచి పేరుంది. గతంలో ఆయన నటించిన చిత్రాలు హిట్ టాక్‌ను తెచ్చి పెట్టాయి. ఇక ఆయన తాజాగా నటించిన చిత్రం డాక్టర్. ఈ మూవీ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు ఈ మూవీని బాగానే ఆదరిస్తున్నారు. ఇక ఈ మూవీలో శివకార్తికేయన్ ఎలా నటించాడు, కథ ఎలా ఉంది ? అన్న వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..
వరుణ్ (శివ కార్తికేయన్), పద్మిని (ప్రియాంక)లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ పద్మిని ఇంట్లో ఒక చిన్నారి కనిపించకుండా పోవడంతో అసలు కథ మొదలవుతుంది. దీంతో వరుణ్ పద్మినికి సహాయం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. ఇక తరువాత ఏమైంది ? అన్నదే కథ.
ఈ మూవీని మిస్టరీ, థ్రిల్లర్, డార్క్ కామెడీ జోనర్‌లో తెరకెక్కించారు. ఈ జోనర్‌లో వచ్చిన అనేక చిత్రాలు ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. అందువల్ల దర్శకుడు నెల్సన్ చక్కని కథను ఎంచుకుని మూవీని తీశారని చెప్పవచ్చు. థ్రిల్లర్ పేరు చెప్పినట్లుగానే ఈ మూవీ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తరువాత సీన్ ఏం జరుగుతుందా ? అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో చిత్ర కథనం కొనసాగుతుంది.
ఈ జోనర్ లో వచ్చిన చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ఇక ఈ మూవీ కూడా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పవచ్చు. ఆద్యంతం థ్రిల్లింగ్‌ను అందిస్తుంది కనుక ప్రేక్షకులు తప్పకుండా ఈ మూవీని ఒకసారి చూడవచ్చు.
ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా శివ కార్తికేయన్ తమ సొంత బ్యానర్ శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌పై ఈ మూవీని నిర్మించారు. ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ తో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…