Prabhas : బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఆ మూవీల అనంతరం ఆయన నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ కాగా.. హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రభాస్ ఫ్లాప్, హిట్ సంగతి పక్కన పెడితే రెమ్యునరేషన్‌ను మాత్రం భారీగానే తీసుకుంటున్నాడట. ఒక్క సినిమాకే ఆయన రూ.120 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలో ఆయన రూ.100 కోట్లు తీసుకునేవారు. కానీ రాధే శ్యామ్ ఫ్లాప్ అయినా రూ.20 కోట్లు పెంచి రూ.120 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. దీంతో ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోలలో ఒకడిగా ప్రభాస్ నిలిచారు.
అయితే రూ.120 కోట్లు అయినా సరే ప్రభాస్‌కు ఇచ్చి ఆయనతో సినిమా చేసేందుకు నిర్మాతలు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఎందుకంటే ఆయన సినిమా యావరేజ్ టాక్ వచ్చినా చాలు.. భారీగా లాభాలు వస్తాయి. కనీసం రూ.1000 కోట్లు కలెక్ట్ అవుతాయి. కనుకనే అంత మొత్తం ఇచ్చి మరీ ఆయనతో నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 5 సినిమాలు ఉండగా.. వాటికి ఆయన రూ.600 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను అందుకోనున్నారు. ఈ క్రమంలోనే ఆ మొత్తంతో ప్రభాస్ ఏం చేయనున్నారనేది హాట్ టాపిక్ అవుతోంది.

ప్రభాస్ తాను సంపాదించే మొత్తంతో దుబాయ్ లేదా సింగపూర్ వంటి దేశాల్లో హోటల్స్‌ను పెట్టాలని చూస్తున్నారట. ఇందుకు గాను ఆయన ప్రస్తుతం కొందరితో కలసి ప్లాన్స్ వేస్తున్నారని సమాచారం. హోటల్ రంగంలోకి అడుగు పెట్టాలని ప్రభాస్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న వివరాలు మాత్రం తెలియలేదు. కానీ అంత మొత్తం వస్తే ఎవరైనా సరే కచ్చితంగా ఏదో ఒక బిజినెస్‌లో పెట్టుబడి పెడతారు. మరి ప్రభాస్ ఏం బిజినెస్ చేస్తారో చూడాలి.