Amala : అక్కినేని నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకోవడం ఏమోగానీ ఎప్పటికప్పుడు వీరి గురించి కొత్త కొత్త రూమర్స్ వస్తున్నాయి. అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు.. అనే విషయాన్ని ఎవరూ ఇప్పటి వరకు చెప్పలేదు. దీంతో సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా మరొక వార్త హల్ చల్ చేస్తోంది. నాగచైతన్యకు సమంత విడాకులు ఇవ్వడానికి కారణం అమలనే అని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
నాగార్జున తన మొదటి భార్య లక్ష్మికి విడాకులు ఇచ్చి తరువాత అమలను చేసుకున్న విషయం విదితమే. అయితే అప్పటికే లక్ష్మికి చైతన్య పుట్టాడు. ఈ క్రమంలోనే చైతూ తల్లి దగ్గర కొంతకాలం, తండ్రి దగ్గర కొంత కాలం ఉన్నాడు. అయినప్పటికీ మొదట్లో అమల చైతూను కూడా బాగానే చూసుకునేదట. కానీ ఎప్పుడైతే అఖిల్ పుట్టాడో అమల స్వభావమే మారిపోయిందట. ఏ విషయంలో అయినా సరే అఖిల్‌కే ఫేవర్‌గా ఆమె మాట్లాడేదట. అలాగా చేసేదట.

ఇక నాగచైతన్య వివాహం చేసుకున్న తరువాత కూడా సమంతకు అమల పోరు ఉండేదట. దీంతో ఆమె టార్చర్ భరించలేకే చైతూకు సమంత విడాకులు ఇచ్చిందట. ఈ క్రమంలోనే సమంత, చైతూల విడాకులకు అమలనే కారణమని వార్తలు వస్తున్నాయి. ఇక అఖిల్ ఎంగేజ్‌మెంట్ రద్దు అయింది కనుక అఖిల్‌కు త్వరగా పెళ్లి చేయాలనే అమల ఆలోచిస్తుందట. కానీ చైతూ విషయం మాత్రం పట్టించుకోవడం లేదని సమాచారం. ప్రస్తుతం ఈ వార్తలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ వీటిలో నిజం ఎంత ఉంది.. అన్న విషయాలు మాత్రం తెలియవు. మరి వీటిపై రానున్న రోజుల్లో అయినా క్లారిటీ వస్తుందేమో చూడాలి.