Poonam Kaur : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఏదో ఒక ప్యానెల్‌కు మద్దతు ఇచ్చారు. అయితే మెగా ఫ్యామిలీలో ఒక్క నాగబాబు మాత్రమే ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇచ్చి ఆయనతో తిరిగారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా ఇరు ప్యానెళ్ల సభ్యులకు తమ మద్దతును ప్రకటించారు. ఇక పూనమ్ కౌర్ ప్రకాష్ రాజ్‌కు మద్దతును ప్రకటించిన విషయం విదితమే.
ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో గెలిస్తే తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతానని.. పూనమ్ కౌర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె అనుకున్నట్లుగా ప్రకాష్ రాజ్ గెలవలేదు. దీంతో పూనమ్ కౌర్ చెబుతానన్న విషయాలను మళ్లీ అటకెక్కించిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆమె ఇప్పుడు ఏమని స్పందిస్తుంది ? ఏం చేస్తుంది ? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గతంలోనే పలు మార్లు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సినీ ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది. ఇటీవల పోసాని కూడా ఇదే విషయంపై మాట్లాడారు. అయితే ప్రకాష్ రాజ్ గెలిచి ఉంటే ఆమె ఆ స్టార్ ఎవరో చెప్పేదా ? అంత సాహసం చేసేదా ? అని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆమెకు ప్రకాష్ రాజ్ గెలవడం కన్నా.. మంచు విష్ణు గెలిస్తేనే.. ఆ విషయమేదో బయటకు చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆమె ఈ విధంగా ఎందుకు చేసిందన్నది సందేహంగా మారింది. అంటే.. ఈమెకు కూడా ప్రకాష్ రాజ్ ఓడిపోతారని ముందే తెలుసా ? అందుకే ఆ విధంగా కామెంట్లు చేసిందా ? అన్న సందేహాలు వస్తున్నాయి. మరి రానున్న రాజుల్లో పూనమ్ కౌర్ ఏమని స్పందిస్తుందో చూడాలి.