IPL 2021 : క్రికెట్ మ్యాచ్‌లు అంటే అంతే. ఒకసారి ఒకరిది పైచేయి అవుతుంది. ఒకసారి ఒకరు ఓడిపోతారు. ఇంకోసారి ఇంకొకరు గెలుస్తారు. దాన్ని స్పోర్టివ్‌గానే తీసుకోవాలి. కానీ అభిమానులు మాత్రం ఇలాంటి వాటిని ఆషామాషీగా తీసుకోరు. ఓటమి అనేది నిజానికి క్రీడాకారుల కన్నా అభిమానులనే ఎక్కువగా బాధిస్తుంది. అందుకే కాబోలు.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిని అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
కోల్‌కతాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి పాలైంది. 138 పరుగులను డిఫెండ్ చేయలేక చేతులెత్తేసింది. అయితే ఎన్నో సీజన్లలో టాప్ లో ఉంటూ కొన్ని సార్లు ప్లే ఆఫ్స్‌కు కూడా వెళ్లిన బెంగళూరు ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీని కూడా లిఫ్ట్ చేయలేదు. కనీసం ఈసారైనా ప్లే ఆఫ్స్‌కు వెళ్లి సత్తా చాటుతుందని భావించారు. కానీ అభిమానుల ఆశలు అడియాశలు అయ్యాయి. బెంగళూరు ఓటమి పాలవడంతో ఆ జట్టు మొత్తాన్ని అభిమానులు దారుణంగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇక విరాట్ కోహ్లిని కూడా నెటిజన్లు వదలడం లేదు.
Surely end of an golden era 😭😭. This hurts💔 more than anything. As a #rcb fan we will support till our breathe. You both are champion. We will miss you 😓😓#Rcb #PlayBold #viratkholi #ABDevilliers #IPL2O21 pic.twitter.com/t4zOkPAHjy
— Anand Yadav (@AnandYadav1718) October 12, 2021
అయితే మ్యాచ్ అనంతరం కోహ్లి సహా పలు ఇతర బెంగళూరు ఆటగాళ్లు భావోద్వేగంతో కనిపించారు. ఇక తమపై వస్తున్న ట్రోల్స్ కు స్పందించిన బెంగళూరు బ్యాట్స్ మన్ మ్యాక్స్‌వెల్.. ఘాటుగా, దీటుగా బదులిచ్చాడు. అసలైన ఫ్యాన్స్ తమను నిందించరని, తమకు మద్దతుగా ఉంటారని అన్నాడు. ఇలాంటి ఫ్యాన్స్ ను చూస్తే అసహ్యంగా ఉందన్నాడు.
This is so Real 🥲🥂#RCBvsKKR #viratkholi #captaincy pic.twitter.com/pKl3cc8U2Y
— PROM✨ (@TheVKstan) October 11, 2021
Who's the next captain of @RCBTweets#RCB #ViratKohli #Kohli #viratkholi #IPL2O21 pic.twitter.com/rfsQ1TEIsV
— 🌶️mr.lavangam (@prashanth_bouyy) October 11, 2021
Dear #rcb #viratkholi pic.twitter.com/OsYDkBncnz
— Chandan yadav (@Chandan___0745) October 11, 2021
కాగా బెంగళూరు రూ.14.25 కోట్లకు మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసినందుకు అతను జట్టుకు న్యాయం చేశాడనే చెప్పవచ్చు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లలో ఆడిన అతను 144.10 స్ట్రయిక్ రేట్‌తో మొత్తం 513 పరుగులు చేసి బెంగళూరు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని సగటు 42.75గా ఉంది. ఇక బౌలింగ్ కూడా చేసిన అతను 3 వికెట్లు తీశాడు. అతను గత సీజన్లలో ఆడిన జట్లకు పెద్దగా ఆడలేదు. కానీ ఈ సీజన్‌లో బెంగళూరు తరఫున ఆడి చక్కని ప్రదర్శనను చేయడం విశేషం. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుపై నెగ్గిన కోల్‌కతా క్వాలిఫైర్ 2 లో ఢిల్లీతో తలపడనుంది. అలాగే క్వాలిఫైర్ 1లో గెలిచిన చెన్నై ఇప్పటికే ఫైనల్స్ కు దూసుకెళ్లిన విషయం విదితమే.