Poonam Kaur : నటి పూనమ్ కౌర్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. మా ఎన్నికల సమయంలో ఈమె చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం విదితమే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ గెలిస్తే తనను మోసం చేసిన వ్యక్తి గురించి చెబుతానని సంచలన ప్రకటన చేసింది. కానీ ఆయన గెలవలేదు. ఇక ఆ విషయం అంతటితో అయిపోయింది. అయితే ఇటీవల ఆమె నటించిన నాతిచరామి అనే సినిమా విడుదలైన సందర్భంగా ఓ సమావేశంలో మాట్లాడుతూ ఏడ్చేసింది. తన జీవితాన్ని నాశనం చేసిన వారు బాగుపడరని చెప్పింది. తనకు ఓ ఫ్రెండ్ ధైర్యం చెప్పిందని.. అందుకనే మళ్లీ సినిమాలు చేస్తున్నానని వెల్లడించింది.
అయితే పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు వివాదాస్పదం అవుతుంటాయి. ఆమె చేసే ట్వీట్లు వివాదాస్పదం కాగానే ఆమె వెంటనే వాటిని డిలీట్ చేస్తుంటుంది. ఇలా చాలా సార్లు జరిగింది. ఇక ఇటీవల ఆమె ఇద్దరు పిల్లలతో ఓ ఫొటోను పోస్ట్ చేయగా.. నెటిజన్లు అనేక అనుమానాలను లేవనెత్తారు. ఆ పిల్లలు ఎవరు పూనమ్ ? అంటూ ప్రశ్నించారు. దీంతో ఆమె ఆ ప్రశ్నలకు స్పందించింది. ఆ పిల్లలు ఎవరో చెప్పేసింది.
సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ ఇద్దరు పిల్లలతో ఫొటోలో కనిపించే సరికి ఆమె గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. ఆమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని.. పిల్లల్ని ఇన్ని రోజులూ దాచి ఉంచి ఇప్పుడు అనూహ్యంగా తెరమీదకు తెచ్చిందని కామెంట్లు చేశారు. అయితే వీటిపై పూనమ్ కౌర్ స్పందించింది. వారు తన పిల్లలు కారని.. తన బెస్ట్ ఫ్రెండ్ పిల్లలని.. వారిపై వస్తున్న పుకార్లను తట్టుకోలేకనే తాను స్పందిస్తున్నానని.. పూనమ్ వెల్లడించింది. ఇక పూనమ్ ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. కానీ సినీ రంగంతోపాటు సమాజంలో జరిగే సంఘటనలపై కూడా ఈమె ట్వీట్లు చేస్తుంటుంది. అవి వైరల్ అయి వివాదాస్పదం అవుతుంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…