Ashoka Vanamlo Arjuna Kalyanam : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. మాస్ కా దాస్.. అశోక వనంలో అర్జున కళ్యాణం అనే చిత్రంతో క్లాస్ కా దాస్‌గా మారాడు. విశ్వక్ సేన్ ఈ క్లాసీ క్యారెక్టర్ ను ఏ విధంగా పోషించాడా.. అని చాలా మంది అభిమానులు, సినీ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ, రాజ్ కుమార్, ఇతరులు ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి రచన రవికిరణ్ కోలా, దర్శకత్వం విద్యా సాగర్ చింత, సంగీతం జై క్రిష్, ఛాయాగ్రహణం పవి. కె. పవన్, ఈ చిత్రాన్ని ఎస్.వి.సి.సి డిజిటల్ సినిమా నిర్మాణంపై బాపినీడు బి, సుధీర్ ఈదర నిర్మించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పించారు. ఈ చిత్రం సూర్యాపేటలో వడ్డీ వ్యాపారి అయిన అల్లం అర్జున్ కథను వివరిస్తుంది. అతను 34 ఏళ్లు వచ్చిన కూడా ఇంకా పెళ్లి చేసుకోని కారణంగా కుటుంబం, సమాజం నుండి ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. వారి కులంలో అమ్మాయిలు అయిపోయారని, వేరే కులం వాళ్ళైనా సరే అని వధువు కోసం వెదుకుతుంటాడు. ఈ క్రమంలోనే పసుపులేటి మాధవి (రుక్సార్ థిల్లాన్) వధువుగా దొరుకుతుంది. అయితే.. పసుపులేటి మాధవి.. అల్లం అర్జున్‌ని తిరస్కరిస్తుంది. ఆమె ఎందుకు తిరస్కరించింది ? ఆ సమయంలో మనోడు పడే బాధలు ఏంటనేది.. సినిమా చూస్తే అర్ధమవుతుంది.
ఈ సినిమా బాగానే మొదలవుతుంది. దర్శకుడు కథలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయాన్ని వృథా చేయలేదు. అయితే సినిమా దాదాపు 15 నుండి 20 నిమిషాల వరకు బాగానే అనిపించినా ఆ తర్వాత సినిమా స్క్రీన్‌ప్లే కాస్త స్లో అవుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా ఆసక్తిని కలిగిస్తుంది. మొదట కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే పండాయి అని చెప్పొచ్చు. కానీ చాలా పాత్రలు అసహజంగా అనిపిస్తాయి. సెకండాఫ్ సినిమాకి వెన్నెముక అననడంలో ఎలాంటి సందేహంలేదు.
అల్లం అర్జున్‌గా విశ్వక్ తన పాత్రకి న్యాయం చేశాడు. చాలా సన్నివేశాల్లో తన నటనను చూపించాడు. ముఖ్యంగా కొన్ని కామెడీ సన్నివేశాలలో చాలా బాగా చేశాడు. రుక్సార్‌తోపాటు మిగతా పాత్రధారులు కూడా బాగా చేశారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఈ చిత్రానికి రచయిత రవికిరణ్ కోలా.. రాజా వారు రాణి వారు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. దశాబ్దాలుగా మనం ఈ రకమైన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను మిస్ అవుతున్నసమయంలో ఇలాంటి కథతో రావడం చాలా మంచి విషయం. 30 సంవత్సరాలు దాటినా పెళ్లి కావట్లేదు.. అని బాధపడేవారు అయితే తప్పకుండా ఈ మూవీని ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…