Jayamma Panchayathi : బుల్లితెరపై తనదైన స్టైల్‌లో వినోదం పంచే యాంర్స్‌లో సుమ ఒకరు. చాలా రోజుల తర్వాత ఆమె వెండితెర మీద సందడి చేసింది. మెయిన్ లీడ్‌గా తెర మీద కనిపించడానికి ఈసారి ఆమె జయమ్మ పంచాయితీ అనే చిత్రంతో తనదైన ముద్ర వేయబోతోంది. ఈ చిత్రం ఈ రోజు మే 6, 2022 న విడుదలైంది. ఈ సినిమాని వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించగా, విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు.
జయమ్మ పంచాయితీ కథ..
శ్రీకాకుళంలో నివసించే జయమ్మ తన భర్త, పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటుంది. అయితే భర్తకి ఒక జబ్బు ఉండడం వల్ల తన భర్తను చూసుకోవడానికి ఆమెకు డబ్బు అవసరం పడుతుంది. ఆమె తన సమస్యను పరిష్కరించుకోవడానికి గ్రామ పంచాయతీని ఆశ్రయిస్తుంది, అక్కడ ఆమె సమస్యని విని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతారు. మరోవైపు అదే సమయంలో ఊరు ప్రజలు సమస్యలను పరిష్కరించడానికి తల మునకలవుతారు. మరి జయమ్మ తన సమస్యని పరిష్కరించుకుందా, లేదా.. అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. సినిమా బాగా మొదలవుతుంది. అయితే పాత్రలను పరిచయం చేయడానికి దర్శకుడు చాలానే సమయం తీసుకున్నాడు. ప్రేక్షకులు సినిమా అంతటా ఎంగేజ్ అవుతారు. కొన్ని అందమైన హాస్య సన్నివేశాలు, గ్రామ పంచాయితీ సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ వస్తాయి. జయమ్మ పాత్రలో సుమ కనకాల జీవించేసింది. ఆమెతోపాటు మిగతా పాత్రధారులు ఆకట్టుకున్నారు.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. విజయ్ కుమార్ కలివరపుకి ఇది మొదటి సినిమా అయినా తన రచనలో చాలా పరిణతి చెందినట్లు అనిపిస్తుంది. అతను సినిమాను చాలా డీసెంట్‌గా డీల్ చేశాడు. అనుష్ కుమార్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎందుకంటే సినిమా తక్కువ బడ్జెట్‌తో రూపొందించినప్పటికీ అతని విజువల్స్ వల్ల సినిమాన రిచ్‌గా, క్వాలిటీగా కనిపిస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం సినిమా ప్రధాన హైలైట్‌లలో ఒకటి. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…