Poonam Kaur : పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. సమాజంలో జరిగే పలు సంఘటనలపై ఈమె స్పందిస్తుంటుంది. ఇటీవలే ఈమె నాతిచరామి అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కానీ అసలు ఈ మూవీ వచ్చి వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఇక పూనమ్ కౌర్ ఎల్లప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేస్తుంటుంది. వెంటనే వాటిని డిలీట్ చేస్తుంది. కానీ అప్పటికే అవి వైరల్ అవుతుంటాయి.
పూనమ్ కౌర్ ఎక్కువగా చేసే ట్వీట్లలో గూఢార్థాలు దాగి ఉంటాయి. దీంతో ఆమె అసలు ఎవరి గురించి ట్వీట్ చేస్తుందో అర్థం కాదు. తన ట్వీట్లలో ఆమె పీకేలవ్ అని ఇంగ్లిష్‌లో హ్యాష్ ట్యాగ్స్ పెడుతుంటుంది. అయితే పీకే అంటే పూనమ్ కౌరా లేక పవన్ కల్యాణా.. అనే విషయం మాత్రం అర్థంకాదు. గతంలో మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ విజయం సాధిస్తే తనకు ద్రోహం చేసినవారి గురించి చెబుతానని ఈమె సంచలన ప్రకటన చేసింది. కానీ మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. దీంతో ఈ విషయం మరుగున పడిపోయింది. అయితే తాజాగా మరోమారు పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఓ నెటిజన్ ఆమెను అడిగిన ప్రశ్నే అని చెప్పవచ్చు. ఇంతకీ అతను ఏం అడిగాడు.. అంటే..

పూనమ్ కౌర్ ట్వీట్లలో #PKLOVE అని ఉంటుంది కదా. అయితే పీకే అంటే ఏమిటో చెప్పాలని ఓ నెటిజన్ అడగ్గా.. దానికి పూనమ్ కౌర్ ఏవేవో అర్థాలు చెప్పింది. తనను ఇలాంటి ప్రశ్నలు అడగకూడదని.. తనను కార్నర్ చేయడం అంత సులభం కాదని.. పూనమ్ కౌర్ ట్వీట్ ద్వారా ఆ నెటిజన్‌కు రిప్లై ఇచ్చింది. దీంతో ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే పీకే అంటే.. పవన్ కల్యాణ్ అని.. కానీ పూనమ్ కౌర్ ఆయన పేరును బహిరంగంగా ఓపెన్‌గా చెప్పేందుకు ఇష్టపడదని.. కనుకనే అలా షార్ట్ కట్‌లో పీకే అని పెడుతుందని.. కొందరు అంటున్నారు. ఇక దీని గురించి ఆమె రానున్న రోజుల్లో అయినా చెబుతుందో.. లేదో.. చూడాలి.
https://twitter.com/poonamkaurlal/status/1531569079806529537