Son Of India Movie : మోహన్‌బాబు నటించిన లేటెస్ట్ మూవీ.. సన్ ఆఫ్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఎంత ఘోర పరాజయం పాలైందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యంత అట్టర్‌ఫ్లాప్ మూవీగా నిలిచింది. దీనికి తోడు నెటిజన్లు మోహన్‌బాబును ఈ సినిమా తీసినందుకు ఒక ఆట ఆడుకున్నారు. ఈ సినిమాపై భారీ ఎత్తున ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. ఒక దశలో మంచు ఫ్యామిలీ తమపై మీమ్స్ చేస్తే రూ.10 కోట్ల మేర పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అయితే నెటిజన్లు ఈ విషయంపై కూడా ట్రోల్ చేశారు. దీంతో ఇంకా లాగడం మంచిది కాదని మంచు ఫ్యామిలీ గప్‌చుప్‌గా ఉండిపోయింది.
అయితే థియేటర్లలో నిరాశ పరిచిన సన్ ఆఫ్ ఇండియా మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో గుట్టు చప్పుడు కాకుండా రిలీజ్ అయింది. దీంతో ఓటీటీలోనూ ఈ మూవీని చూడలేం బాబూ.. అంటూ నెటిజన్లు మళ్లీ ట్రోల్స్ చేశారు. అయితే ఈ సినిమాకు గాను అమెరికాలో ఉన్న ప్రేక్షకులకు అమెజాన్ షాకిచ్చింది. దీన్ని ఫ్రీగా చూపించినా ఎవరూ చూడరు. అలాంటిది అమెరికాలో ఈ మూవీని చూడాలంటే 2.99 డాలర్లు, అదే కొనుగోలు చేయాలంటే 9.99 డాలర్లు చెల్లించాలని అమెజాన్ షరతు విధించింది. దీంతో అమెజాన్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అసలే డిజాస్టర్ అయిన మూవీని ఉచితంగానే చూడలేం. అలాంటిది దానికి డబ్బులు చెల్లించి ఎవరు చూస్తారు.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులకు మైండ్ గానీ ఏమైనా దొబ్బిందా.. అని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ వార్తపై నెటిజన్లు మళ్లీ ట్రోల్ చేస్తూ మీమ్స్ సృష్టిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీ వార్తల్లోకి ఎలా వచ్చినా సరే వారిపై ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. అయితే ఇలా ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.