Pawan Kalyan : ఈ దసరా నుంచి ఆంధ్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ మంగళవారం జనసేన మీటింగ్ తర్వాత అనూహ్యంగా తన యాత్రను వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో చివరి ఏడాది బస్సు యాత్ర చేపట్టడానికి రంగం సిద్ధం చేశారు. ఏపీ మొత్తం సందర్శించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. చివరి 6 నెలలు ప్రజలతో ఒకడిగా ఉండాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని.. జగన్ ను ఓడించడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు.
పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలుపు దిశగా తన రంగం సిద్ధం చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. ఇక సినిమాల విషయంలో కూడా తనకు సంబంధించిన పనులన్నీ చకచకా పూర్తి చేసుకుంటున్నారు. బస్సు యాత్రకు బ్రేక్ పడటంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న సినిమాలను త్వరగా పూర్తి చేసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. బస్సు యాత్ర నిలిచిపోవడంతో నిర్మాతలు కూడా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు చిత్రం చివరి దశలో ఉంది. ఆ తర్వాత హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్, వినోదయా సీతం రీమేక్ సెట్స్ మీదకు రాబోతున్నాయి. అంతేకాకుండా సురేందర్ రెడ్డి సినిమా ఒకటి అనుకుంటున్నారు. బస్సు యాత్ర లేకుంటే ఈ సినిమాలన్నీ పూర్తయినట్లే.
ఇక తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ అర్జెంటుగా అమెరికా యాత్రకు సిద్ధం అవ్వాల్సి వచ్చింది. అక్కడ కొంతమంది ప్రముఖులను భేటీ కావాల్సి ఉందని దానికోసమే ఇంత అర్జెంటుగా పవన్ కళ్యాణ్ అమెరికాకు వెళ్లినట్లు తెలిసింది. మరో రెండు మూడు రోజుల వరకూ పవన్ అమెరికాలోనే ఉండవలసి వస్తుందని సమాచారం వినిపిస్తుంది. ఇంతకీ పవన్ అమెరికాకి వెళ్ళవలసిన కారణం సినిమాల పరంగానా.. రాజకీయపరంగానా లేదా ఆర్థిక సంబంధిత విషయాలపై భేటీనా.. అనే విషయం తెలియాల్సి ఉంది.