Pawan Kalyan : సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్‌ల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వీరిద్దరూ మైసూర్‌లోని ఓ హోటల్‌లో ఉండగా.. అక్కడికి నరేష్ భార్య రమ్య రఘుపతి చేరుకుని వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తరువాత రమ్య పవిత్రను చెప్పుతో కొట్టబోగా పోలీసులు అడ్డుకున్నారు. తరువాత అందరినీ అక్కడి నుంచి పంపించివేశారు. అయితే ఈ ముగ్గురూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నరేష్ తన భార్య రమ్యకు ఇంకో అఫెయిర్ అంట గట్టారు. అలాగే రమ్య మాట్లాడుతూ నరేష్‌కు, పవిత్రకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని.. తాను న్యాయం పోరాటం చేస్తానని తెలిపారు.
ఇక పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. తాను నరేష్ కలిసే ఉంటున్నామని.. తమకు సపోర్ట్ అందించాలని కోరారు. అలాగే తన పేరిట వస్తున్న తప్పుడు వార్తలతోపాటు తన పేరిట ఓపెన్ అయి ఉన్న ఫేక్ అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇక ప్రస్తుతం కథ ఇక్కడి వరకు రాగా.. వీరి వ్యవహారంలోకి తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను లాగారు. అందుకు కూడా ఒక కారణం ఉంది. పవన్ ఈమధ్యే నాని మూవీ అంటే సుందరానికీ.. ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. అక్కడ నరేష్‌ను ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు.
నరేష్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషని, చెన్నైలో పక్క పక్కనే ఉండేవాళ్లమని పవన్ తెలిపారు. నరేష్ ఎంతో హుందాగా ఉంటారంటూ ఆయనను పవన్ ఆకాశానికెత్తేశారు. అయితే నరేష్ వ్యవహారం మొత్తం బట్టబయలు కావడంతో ఆయనను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అలాగే అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ ఆయన గురించి మాట్లాడిన మాటల తాలూకు వీడియోను బయటకు తీసి.. పవన్, నరేష్ ఇద్దరూ దొందూ దొందే.. ఒకరికి ఒకరు సరిపోయారని అంటున్నారు. ఇద్దరూ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని.. ఇద్దరి కథ సేమ్ అని.. అలాంటిది నరేష్‌ను పవన్ పొగడడం హాస్యాస్పదంగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. అయితే పవన్ అనవసరంగా ఈ వివాదంలో ట్రోలింగ్‌కు గురవుతుండడంతో ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక నరేష్, పవిత్ర లోకేష్, రమ్యల కథకు ఎప్పుడు శుభం కార్డు పడుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…