Mahabaleshwaram : ఈ మధ్య కాలంలో మనకు వార్తల్లో తరచూ వినిపిస్తున్న ఆలయం పేరు ఒకటి ఉంది. అదే మహాబలేశ్వరం ఆలయం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణంలో ఉంది. అయితే సెలబ్రిటీ జంటలు చాలా మంది ఈ మధ్య కాలంలో తరచూ ఈ ఆలయానికి వెళ్తున్నారు. మొన్నటికి మొన్న నరేష్, పవిత్ర లోకేష్‌లు ఈ ఆలయాన్ని దర్శించుకోగా.. గతంలో నయన తార, విగ్నేష్‌లు ఈ ఆలయాన్ని దర్శించుకుని ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అయితే సెలబ్రిటీ జంటలు ఈ ఆలయాన్ని తరచూ ఎందుకు దర్శించుకుంటున్నారు ? అంతగా దీని ప్రత్యేకత ఏముంది ? అన్న వివరాల్లోకి వెళితే..
మహాబలేశ్వరం ఆలయాన్ని గోకర్ణ క్షేత్రం అని కూడా అంటారు. ఇది గోవాకు అతి సమీపంలో ఉంటుంది. కనుక ఈ ఆలయం పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంటుంది. ఇక్కడ ఉన్నది శివుడు. ఆత్మలింగం రూపంలో ఉంటాడు. అప్పట్లో రావణాసురుడు తనకు ఇచ్చిన ఆత్మ లింగాన్ని ఇక్కడే విడిచిపెట్టాడని స్థల పురాణం చెబుతోంది. అలాగే మారు వేషంలో వచ్చి లింగాన్ని కింద పెట్టిన వినాయకుడి ఆలయం కూడా ఈ క్షేత్రంలోనే ఉంది. కనుక ఇందులో శివుడితోపాటు వినాయకున్ని కూడా దర్శించుకుంటారు. అయితే ఇక్కడ కుజ దోష పూజలు కూడా చేస్తారు.
మహాబలేశ్వరం ఆలయంలో కుజ దోష పూజలు చేస్తారు. పెళ్లి కాని వారు, అయిన వారు కూడా ఈ పూజలు చేసుకోవచ్చు. దీంతో ఈ దోషం పరిహారం అవుతుందని నమ్ముతారు. కనుకనే సెలబ్రిటీలు చాలా మంది ఈ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. గతంలో నయనతార, విగ్నేష్‌లు కూడా ఇక్కడ దోష నివారణ పూజలు చేశారు. ఇటీవల నరేష్, పవిత్ర లోకేష్‌లు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. సెలబ్రిటీలు చాలా మంది ఈ ఆలయాన్ని బాగా నమ్ముతారు. కనుకనే సహజంగానే వారి తాకిడి ఈ ఆలయానికి ఎక్కువగా ఉంటుంది.
ఇక మహాబలేశ్వరం చేరుకోవాలంటే విమానమార్గంలో అయితే గోవా బెటర్. రైలు మార్గం అయితే గోకర్ణంకు 23 కిలోమీటర్ల దూరంలో కుంట, 25 కిలోమీటర్ల దూరంలో అంకోలా స్టేషన్లు ఉన్నాయి. వీటికి వచ్చి గోకర్ణంకు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రోడ్డు మార్గం అయితే నేరుగానే వెళ్లవచ్చు. ఆలయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు దర్శనం కోసం తెరిచి ఉంచుతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…