Anasuya : తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఓ వైపు బుల్లితెరపై టీవీ షోలలో అదరగొడుతూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. ఈ మధ్య కాలంలో అనసూయ నటించిన అనేక చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. అప్పట్లో ఈమె నటించిన రంగస్థలం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో రంగమ్మత్తగా ఈమె యాక్టింగ్ అద్భుతంగా చేసింది. అలాగే మొన్నీ మధ్య వచ్చిన పుష్పలో దాక్షాయణి పాత్రలో నెగెటివ్ రోల్‌లో కనిపించి అదరగొట్టేసింది. ఇలా అనసూయ బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా దూసుకుపోతోంది.
అయితే అనసూయపై ఓ కార్యక్రమంలో భాగంగా అదిరే అభి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా అభి మాట్లాడుతూ.. అను, నిన్ను కెరీర్ బిగినింగ్ నుంచి చూస్తున్నా. న్యూస్ రీడర్గా చేశావు, యాంకర్‌గా చేశావు, ఇప్పుడు నటి అయ్యావు. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాల్లో నటిస్తున్నావు. నీ ఎదుగులకు నువ్వే కారణం. నీకు ఎవరూ భిక్షపెట్టలేదు. నువ్వు కష్టపడి పైకి వచ్చావు. పుష్ప హిట్ అయ్యాక నీకు హిందీలోనూ పేరు వచ్చింది. ఇక తగ్గేదేలే. నువ్వు ఇంకా మంచి సినిమాలు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి.. అంటూ అభి అనసూయను పొగడ్తల్లో ముంచెత్తాడు.
కాగా తనపై అభి చేసిన కామెంట్స్‌కు అనసూయ మురిసిపోయింది. ఆమె సంతోషంగా అభికి థాంక్స్ చెబుతూ లవ్ ఎమోజీలతో కూడిన పోస్ట్‌ను పెట్టింది. అయితే అనసూయ రీసెంట్‌గా జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పేసింది. తన కెరీర్‌లో తాను ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నానని.. ఇకపై కూడా ప్రేక్షకులు తనకు మద్దతుగా ఉంటారని కోరుకుంటున్నానని.. అనసూయ పోస్ట్ పెట్టింది. అయితే ఆమె జబర్దస్త్‌ను వీడేందుకు కారణం సినిమాలే అని తెలుస్తోంది. సినిమాల్లో చాన్స్‌లు బాగా వస్తున్నందునే టీవీ షోలకు గుడ్ బై చెబుతుందని సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…