God Father Movie : సినిమాను ఒకసారి ఒక భాషలో తీశాక దాన్ని ఇంకో భాషలో రీమేక్ చేయడం అంటే.. అది సాహసమనే చెప్పాలి. ఎందుకంటే ఒరిజినల్ సినిమాను రీమేక్‌తో పోలుస్తారు. అందులో ఉన్న ప్లస్‌లు ఏమిటి.. ఇందులో ఉన్న మైనస్‌లు ఏమిటి.. ఒరిజినల్‌లో బాగానే చేశారు కదా.. రీమేక్‌లో అసలు బాగా లేదు.. అన్న కామెంట్లు సహజంగానే వినిపిస్తాయి. కనుక మేకర్స్ ఎప్పుడైనా సరే సినిమాలను రీమేక్ చేసేటప్పుడు ఒరిజినల్‌కు తగ్గట్లుగా ఉండాలి. భారీ ఎత్తున మార్పులను చేయకూడదు. అలా చేస్తే ఒరిజినల్‌ను పోల్చి చూసి బాగాలేదనే అంటారు. అవును.. సరిగ్గా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకు కూడా ఇలాగే జరుగుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
మళయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన మోహన్‌లాల్ సినిమా లూసిఫర్ గుర్తుంది కదా. ఈ మూవీ తెలుగులోనూ డబ్బింగ్ అయింది. అయితే ఈ సినిమా కథనే చిరంజీవి మళ్లీ గాడ్ ఫాదర్ మూవీగా రీమేక్ చేస్తున్నారు. ఇందులో అనేక మంది కీలక నటీనటులు నటిస్తున్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, నయనతార, సునీల్, అనసూయ వంటి వారు ఇందులో యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో చిరంజీవికి చెందిన ఫస్ట్ లుక్‌ను లేటెస్ట్‌గా విడుదల చేశారు. ఇందులో ఆయన నలుపు రంగు డ్రెస్ ధరించి తెల్ల జుట్టుతో కనిపించారు. అయితే ఒరిజినల్‌లో ఇందుకు భిన్నంగా ఉంటుంది.
మళయాళం లూసిఫర్ సినిమాలో మోహన్‌లాల్ వైట్ అండ్ వైట్‌లో పంచెకట్టుతో కనిపించారు. అలాగే ఆయనకు తెల్ల జుట్టు కూడా ఉండదు. కానీ గాడ్ ఫాదర్ లో మాత్రం చిరంజీవి తెల్ల జుట్టుతో కనిపించడమే కాకుండా నలుపు రంగు దుస్తులను ధరించి ఉన్నారు. ఇదే ఫ్యాన్స్‌కు నచ్చలేదు. వైట్ అండ్ వైట్ అయితే చాలా బాగుండేదని.. అలాగే తెల్ల జుట్టు అసలు ఏమీ బాగా లేదని.. అందువల్ల ఈ సినిమాలో చిరంజీవి లుక్ నచ్చడం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే చిరు ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.
అసలే ఆచార్య ఫ్లాప్ కారణంగా తీవ్రంగా విచారం చేస్తున్న ఫ్యాన్స్‌కు గోటి చుట్టుపై రోకలిపోటులా గాడ్ ఫాదర్‌లో చిరు లుక్ మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే సినిమా ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశారు కనుక ఇప్పటికప్పుడు చిరు లుక్‌ను మార్చలేరు. కానీ లుక్ సంగతి పక్కన పెడితే అసలు సినిమాను ఎలా తీసి ఉంటారు.. ఒరిజినల్‌లాగే ఉంటుందా.. లేక పూర్తిగా మార్చేశారా.. అన్న ప్రశ్నలు కూడా ఫ్యాన్స్‌కు వస్తున్నాయి. అయితే భారీ మార్పులు చేస్తే గనక సినిమాపై నెగెటివ్ ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్‌తో పోలుస్తూ ఈ మూవీని చూస్తారు. అప్పుడు ఒరిజినల్‌లో మాదిరిగా లేకపోతే.. తీవ్ర అసంతృప్తికి లోనవుతారు. దీంతో సినిమాను ఎవరూ చూడరు. ఫలితంగా మళ్లీ ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంటుంది. అదే జరిగితే చిరు ఖాతాలో ఇంకో ఫ్లాప్ జమ అవుతుంది. మరి అక్కడి వరకు పరిస్థితులు దారి తీస్తాయా.. అసలు సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా.. అన్నది సినిమా విడుదల అయితే గానీ తెలియదు. కానీ చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం ఫ్యాన్స్ ను బాగానే డిజప్పాయింట్ చేసిందని చెప్పవచ్చు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…