Pawan Kalyan Bandla Ganesh : సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు పెద్దఎత్తున వైసీపీ మంత్రులు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు భారీ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై నటుడు పోసాని కృష్ణమురళి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించారు. పోసాని వ్యాఖ్యలపై స్పందిస్తూ జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో పోసాని కృష్ణమురళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తన దేవుడిగా భావించే బండ్ల గణేష్ ప్రస్తుతం స్పందించకపోవడం గమనార్హం. తను పవన్ కళ్యాణ్ ను ఒక దైవంగా భావిస్తానని ఎన్నో సందర్భాలలో చెప్పిన బండ్ల గణేష్ ఇప్పుడు తన దేవుడిపై ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో అతను మౌనంగా ఉండడానికి గల కారణం అతను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న సందర్భంగా ఆయన ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 10వ తేదీన ఈ ఎన్నికలు అయిపోగానే 11వ తేదీన తప్పకుండా ప్రెస్ మీట్ పెడతానని.. ఆ రోజు ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని ఈ సందర్భంగా బండ్ల గణేష్ వెల్లడించారు. శ్వాస ఉన్నంతవరకు తన దైవం పవన్ కళ్యాణ్ అని మరోసారి బండ్ల గణేష్ పేర్కొన్నారు.