Pawan Kalyan : వైసీపీ నేతలు గ్రామ సింహాలని, వారు చేసేవి గోంకారాలని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం మంగళగిరిలో నిర్వహించిన జనసేన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రసంగాన్ని ఆయన పంచ్‌లతోనే ప్రారంభించారు. జన సైనికులు చేసేవి సింహ గర్జనలు అని అన్నారు. వైసీపీ నేతలు గ్రామ సింహాలని అన్నారు.

భయం అంటే ఏమిటో నేర్పిస్తానని పవన్ అన్నారు. తాను గ్రామ సింహాలు అనే పదంపై రీసెర్చ్ చేశానని తెలిపారు. అందుకు అర్థం.. కుక్కలు, ఊర కుక్కలు, వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు అని అర్థాలు వస్తాయన్నారు. వైసీపీ నేతలను బయటకు లాక్కొచ్చి కొడతామన్నారు. కులాల చాటున దాక్కుంటే బయటకు లాక్కొచ్చి కొడతామన్నారు. బూతులు మాట్లాడడం నాకూ వచ్చన్నారు.
Pawan Kalyan : నా వ్యక్తి గత జీవితం బ్లాక్ అండ్ వైట్
తమ హక్కులకు భంగం కలగనంత వరకు ఊరుకుంటామని, భంగం కలిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అనాల్సినవి అన్నీ అని కులాల మాటున దాక్కుంటున్నారని విమర్శించారు. తమను ఇబ్బందుల పాలు చేస్తే చట్ట ప్రకారం ముందుకు సాగి శిక్షలు పడేలా చేస్తామన్నారు. తన వ్యక్తి గత జీవితం బ్లాక్ అండ్ వైట్ అని అన్నారు. వైసీపీ నేతల్లా తాను మాట్లాడలేదని అన్నారు.

తానెప్పుడూ లైన్ దాటి మాట్లాడలేదని పవన్ అన్నారు. ఇది తన ఒక్కడి ప్రయాణం కాదని, అందరి ప్రయాణం అని అన్నారు. తాను చాలా బాధ్యతగా మాట్లాడతానని, ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడుతానని అన్నారు. తాను ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించే ప్రశ్నిస్తానని తెలిపారు. తాను సినిమా హీరోని కానని, ప్రజల కోసం పాటుపడే వ్యక్తినని అన్నారు.
ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని అన్నారు. సినిమాలు అంటే ఇష్టం లేక కాదని, సినీ ఇండస్ట్రీ తనకు తల్లితో సమానమని అన్నారు. కలుపుమొక్కలను తీసేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.

యుద్ధం ఎలా కావాలో చెప్పాలని పవన్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. కోడికత్తి గ్యాంగ్‌కు భయపడే వ్యక్తిని కాదని, తనకు భయం అంటే ఏమిటో తెలియదని, తన జోలికి వస్తే బాగుండదని అన్నారు. మీరు ఎంత తిడితే నేను అంతే తిడతా.. అని అన్నారు. తనకు థియేటర్లు లేవని, వైసీపీ నేతలకే ఉన్నాయని అన్నారు.
వైసీపీ నేతలు పిసినారులని, ఎంగిలి చేత్తో కాకులని తోలరని, అలాంటి వారు తనను ఎలా ప్రశ్నిస్తారని పవన్ అన్నారు. ఆడబిడ్డలకు తాను గౌరవం ఇస్తానన్నారు. తాను చాలా ఓర్పుగా మాట్లాడుతానని స్పష్టం చేశారు. తాను 4 భాషల్లో తిట్టగలనన్నారు. వైసీపీతో అమీ తుమీ తేల్చుకుంటామన్నారు. తన తల్లిదండ్రులకు తనకు సంస్కారం నేర్పించారన్నారు. తాను బలపడతాను తప్ప బలహీనపడనని అన్నారు. తనకు ఇడుపులపాయ లాంటి ఎస్టేట్ ఇవ్వలేదని, తన తల్లిదండ్రులు తనకు ధైర్యం, తెగువ ఇచ్చారని అన్నారు.