Kodali Nani : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై స్పందించారు. ఏపీ ప్రభుత్వాన్ని ఆయన తప్పుబట్టారు. దీంతో ఏపీ మంత్రులు వర్మకు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే మంత్రి పేర్ని నాని స్పందించగా.. తాజాగా కొడాలి నాని కూడా ఇదే విషయంపై మాట్లాడారు.
ప్రజలకు తక్కువ ధరకే వినోదాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొడాలి నాని అన్నారు. సినిమా టిక్కెట్ల ధరలను నియంత్రించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. పక్క రాష్ట్రంలో ఉంటూ అక్కడే సినిమాలను తీస్తూ ఈ రాష్ట్రంలో టిక్కెట్ల ధరల గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు.
మా ఇష్టం వచ్చినట్లు సినిమాలను తీసుకుంటాం.. మా ఇష్టం వచ్చిన ధరలు పెట్టి టిక్కెట్లను అమ్ముకుంటాం.. అంటే ఎవరికీ అభ్యంతరం లేదని, నిరభ్యంతరంగా టిక్కెట్లను అమ్ముకోవచ్చని.. అసలు అలా చేసేంతటి సీన్ ఎవరికైనా ఉందా..? అని కొడాలి నాని ప్రశ్నించారు.