Pawan Kalyan : హీరోలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అభిమానులు తమ అభిమాన స్టార్స్‌ని ముద్దుగా పలు పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పేర్లతో పిలిపించుకునేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. గోకులంలో సీత సినిమాకు పోసాని కృష్ణమురళి మాటలు రాశాడు. ఈ సినిమాకు పనిచేసిన సమయంలో పవన్ కళ్యాణ్‌ను చూసిన పోసాని.. పవర్ స్టార్ పేరు ఆయనకు సరిగ్గా సరిపోతుందని అనుకున్నాడు. అప్పటి నుండి పవర్ స్టార్ పేరు పవన్ ముందు యాడ్ అయింది.
అయితే గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక విషయం పదే పదే చెబుతూ వస్తున్నారు. తనను పవర్ స్టార్ అని పిలవద్దు అంటూ చెప్పుకొచ్చారు. పవర్ లేనివాడు పవర్ స్టార్ కాదని.. తనను జనసేనాని అని పిలవండి చాలు అన్నారు. తాను సరదాగా రాజకీయాలు చేయడం లేదు.. బాధ్యతతో రాజకీయాలు చేస్తున్నాని పవన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తమిళ స్టార్ హీరో అజిత్ తనను తల అజిత్ అని పిలవొద్దంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

‘ఇకపై ఎవరూ కూడా నన్ను ‘తల’ అని పిలవోద్దు, రాయొద్దు. అంతేకాదు నా పేరుకు ముందు తల మాత్రమే కాదు మరే ఇతర బిరుదులను జోడించకండి. ఒకవేళ నా గురించి రాయాల్సి వస్తే నన్ను అజిత్, అజిత్ కుమార్ లేదా ఏకే అని మాత్రమే పిలవండి. మీ అందరికీ మంచి ఆరోగ్యం, సంతోషం, విజయం, మనశ్శాంతి, సంతృప్తితో కూడిన అందమైన జీవితాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రేమతో మీ అజిత్.. అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆయన ఈ ప్రకటన ఇవ్వడానికి కారణమేంటో వెల్లడించలేదు.