Pawan : 30 ర‌కాల దుస్తుల‌లో స‌రికొత్త లుక్‌లో క‌నిపించనున్న‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

Pawan : రీ ఎంట్రీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దుమ్ము రేపుతున్నాడు. రీసెంట్‌గా భీమ్లా నాయ‌క్ చిత్రంతో ప‌ల‌క‌రించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమా చేస్తున్నాడు. క్రిష్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. శ్రీరామ నవమి సందర్భంగా హ‌రిహ‌ర వీర మ‌ల్లు చిత్ర మేకర్స్‌ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటెన్స్ లుక్‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు ప్రేక్ష‌కుల‌లో సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి.

Pawan

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో పవన్ మూడు విభిన్నమైన అవతారాల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. దానికి అనుగుణంగా అత‌ను 30 ర‌కాల దుస్తులు ధ‌రించి స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. హరి హర వీర మల్లులో అతను ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాడు. క్రిష్‌ దర్శకత్వం వహించే ఈ సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 50 శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశారు. మిగిలిన భాగాన్ని చిత్ర యూనిట్ ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేస్తోంది.

పీరియాడిక్‌ యాక్షన్ అండ్ అడ్వెంచర్ డ్రామాగా ఈ మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా పాత్రకు అనుగుణంగా తన మేక్ ఓవర్ ను పూర్తిగా మార్చేశాడు. మరోవైపు యుద్ధ విన్యాసాలతోనూ ఆకట్టకుంటున్నాడు. ఇప్పటికే సెట్ నుంచి విడుదలైన రిహార్సల్ ఫొటోలు, వీడియోలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అదిరిపోయే స్టంట్స్ తో పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం తరువాత పవన్ తాను ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ పవన్ మాత్రం ఇప్పుడు మరో రీమేక్ చిత్రంపై కన్నేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ చిత్రం వినోదయ సీతం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని పవన్ ఆలోచిస్తున్నాడట.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM