Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమాలతోపాటు పలు యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఆయన నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12న విడుదలకి సిద్ధమైంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క సినిమాలతోపాటు మరో పక్క బ్రాండ్ ఎండార్స్ మెంట్లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఆయన థమ్సప్, అభి బస్, ఐడియా, సంతూర్, పారగాన్, మౌంటెన్ డ్యూ, బిగ్ సి లాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. థమ్సప్‌తో ఇటీవలే కాంట్రాక్టును రద్దు చేసుకుని కొత్తగా మౌంటెయిన్ డ్యూ సంస్థకు యాడ్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ఇప్పుడు ఒక ప్రముఖ అంతర్జాతీయ కార్ల బ్రాండ్ కొత్త వెంచర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు.
పర్యావరణానికి హాని కలిగించని విధంగా ఎలక్ట్రిక్ వెహికల్ పట్ల మొగ్గు చూపారు మహేష్ బాబు. కొత్తగా ఆడి ఇ-ట్రాన్ కారును కొనుగోలు చేశారు. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు అది. విద్యుత్ ఆధారంగా నడుస్తుంది. దీని ధర.. 1 కోటి 15 లక్షల రూపాయలు. ఈ కారును కొనుగోలు చేసినట్లు మహేష్ బాబు వెల్లడించారు. ఈ మేరకు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ చేతుల మీదుగా మహేష్ ఈ కారుని అందుకున్నారు.
ఈ కారుకి ఆయన పెయిడ్ పార్ట్‌నర్ షిప్‌గా వ్యవహరిస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రమోట్ చేస్తుండటం విశేషం. ఇక ఆడి ఈ ట్రాన్ ఎలక్ట్రిక్ కారు స్పెషాలిటీ చూస్తే, ఇది పూర్తి ఎలక్ట్రిక్ వాహనం. ఆడి సంస్థ ఫస్ట్ టైమ్ ఇండియాలో దీన్ని లాంచ్ చేసింది. గతేడాది ఆడి సంస్థ దీన్ని లాంచ్ చేయగా.. దీన్ని మహేష్ బుక్ చేసుకున్నారు. కాగా ఈ కారుని శనివారం మహేష్ బాబుకి హ్యాండోవర్ చేశారు. ఈ ఆడి ఈ ట్రోన్ కారు ధర కోటి రూపాయలు.
ఎక్స్ షోరూం ప్రైజ్ రూ.1.14కోట్ల వరకు ఉంది. ఈ కారు బ్యాటరీ సామర్థ్యం 95 కిలో వాట్స్. 402 హార్స్ పవర్స్ తో 6640 ఎన్‌ఎం టార్క్ ని అందిస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలోనే వంద కిలోమీటర్ల స్పీడ్‌ని అందుకుంటుంది. కారు గరిష్ట వేగం 190 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 484 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేస్తుంది. ప్రస్తుతం మహేష్‌బాబు రేంజ్‌రోవర్ కారుని వాడుతున్నారు. దీంతోపాటు ఆయన వద్ద మెర్సిడెస్ జిఎల్‌ఎస్ 350డి మోడల్, మెర్సిడెస్ జిఎల్ క్లాస్ 450 మోడల్ బెంజ్ కార్లు, టొయోటా ల్యాండ్ క్రూయిజ్, బీఎండబ్ల్యూ 730ఎల్‌డి కార్లు ఉన్నాయి. తాజాగా ఆయన గ్యారేజ్‌లోకి ఆడి ఎలక్ట్రిక్ కారు చేరింది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…