NTR Hanuman Deeksha : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ హిట్ అయిన కారణంగా ఇటీవలే చిత్ర యూనిట్ ముంబైలో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి నటీనటులు, సిబ్బంది అందరూ హాజరయ్యారు. అయితే పార్టీ అనంతరం రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష చేపట్టగా.. తాజాగా ఎన్‌టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టారు. నారింజ రంగులోని దుస్తులను ధరించిన ఎన్‌టీఆర్ అభిమానులతో ఫొటోలు కూడా దిగారు. దీంతో ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే హనుమాన్ దీక్షను చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి.. అసలు దీక్షను ఎలా చేస్తారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హనుమాన్ దీక్షను కూడా అయ్యప్ప దీక్షలాగే చేస్తారు. హనుమాన్ జయంతి సమయంలో ఈ మాలను ధరిస్తారు. తాజాగా హనుమాన్ జయంతి జరిగింది కనుక అదే రోజు ఎన్‌టీఆర్ ఈ దీక్షను చేపట్టారు. ఇక ఈ దీక్షను ఎన్‌టీఆర్ 21 రోజుల పాటు.. అంటే అర్ధ మండలం పాటు చేస్తారన్నమాట. 42 రోజుల పాటు చేస్తే మండల దీక్ష అంటారు. ఇక మాల ధరించిన వారు రోజూ హనుమాన్ పూజలో ఉండాలి. ఆయన ఆలయంలోనే నిద్రించాలి.
రోజూ హనుమంతున్ని భక్తి శ్రద్ధలతో పూజించాలి. హారతి ఇవ్వాలి. సన్నిధానంలో నిద్రించాలి. రోజూ హనుమంతున్ని దర్శించుకోవాలి. ఆయన నామాన్ని స్మరించాలి. అలాగే హనుమంతుడు రాముడికి ప్రియమైన భక్తుడు. కనుక హనుమాన్ నామ స్మరణ చేయకపోయినా.. రామ నామాన్ని జపిస్తే చాలు.. ఆంజనేయ స్వామి సంతృప్తి చెందుతాడు. సంతోషిస్తాడు. భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుస్తాడు. కనుకనే హనుమాన్ దీక్ష చేపడతారు. ఏవైనా దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్‌లో ఉన్నా లేదా అనుకున్న కోరికలు అసలు నెరవేరక పోయినా.. ముందుగా హనుమంతుడికి మొక్కుతారు. సమస్య పరిష్కారం అయితే మాల ధరిస్తామని వేడుకుంటారు. అలా జరిగాక.. మాల ధారణ చేస్తారు. ఇక కొందరు సమస్యలను పరిష్కరించాలని.. కోరిన కోరికలు నెరవేరాలని ముందుగానే స్వామిని వేడుకుంటూ మాలను ధరిస్తారు. ఇలా హనుమాన్ దీక్ష చేపడతారు.
అయితే సినిమా సెలబ్రిటీలు చాలా మంది అయ్యప్ప మాలనే ధరిస్తుంటారు. కానీ ఎన్‌టీఆర్ మాత్రం ఆశ్చర్యకరంగా హనుమాన్ దీక్ష చేపట్టడం విశేషం. ఏవైనా బలమైన కోరికలు.. మొండి సమస్యలు ఉంటే అవి పరిష్కారం కావాలని.. ఆయురారోగ్యాలు.. ఐశ్వర్యం కలగాలని.. దుష్ట శక్తుల పీడ వదలిపోవాలని కూడా హనుమాన్ దీక్ష చేపడతారు. దీంతోపాటు దిష్టి కూడా తొలగిపోతుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఎన్‌టీఆర్ త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముందుగా ఆలియా భట్ ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమెకు వివాహం జరగడమో.. మరేమైనా కారణాలు ఉన్నాయో.. తెలియదు కానీ ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఇంకో హీరోయిన్ కోసం వెదుకుతున్నారు. అన్ని వివరాలు కన్‌ఫామ్ కాగానే చిత్ర షూటింగ్‌ను ప్రారంభిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…