Pavitra Lokesh : హోట‌ల్‌లో న‌రేష్, ప‌విత్ర లోకేష్‌.. ర‌మ్య‌కు కావాల‌నే దొరికిపోయారా..? అస‌లు క‌థ ఇదే..?

Pavitra Lokesh : గ‌త కొద్ది రోజుల కింద‌ట న‌రేష్, ప‌విత్ర లోకేష్ ఇద్ద‌రూ క‌ల‌సి మైసూర్‌లోని ఓ హోట‌ల్‌లో ఉండ‌గా.. వారు న‌రేష్ భార్య ర‌మ్య ర‌ఘుప‌తికి అడ్డంగా దొరికిపోయారు క‌దా.. ఈ వార్త సంచ‌ల‌నం సృష్టించింది. ర‌మ్య వారిద్ద‌రినీ అక్క‌డే రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. వారు గ‌దిలోంచి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా.. ఆమె ప‌విత్ర‌ను చెప్పుతో కొట్ట‌బోయింది. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. త‌రువాత న‌రేష్.. ప‌విత్ర‌తో క‌లిసి అక్క‌డి నుంచి విజిల్స్ వేస్తూ వెళ్లిపోయారు.

ఆ త‌రువాత ప‌రిణామాలు మ‌రింత సీరియ‌స్ అయ్యాయి. త‌న భ‌ర్త న‌రేష్‌ను ద‌క్కించుకుంటాన‌ని, ప‌విత్ర త‌మ కాపురంలో చిచ్చు పెట్టింద‌ని.. దీనిపై న్యాయ పోరాటం చేస్తాన‌ని.. ర‌మ్య తెలియ‌జేసింది. ఇక న‌రేష్‌, ప‌విత్ర ఇద్ద‌రూ తాము స‌హ‌జీవ‌నం చేస్తున్నామ‌నే విష‌యాన్ని అంగీక‌రించారు. అలాగే త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటాం.. అని కూడా ప్ర‌క‌ట‌న చేశారు. ఈ క్ర‌మంలో వీరి వ్య‌వ‌హారం మ‌రో మ‌లుపు తిరిగిన‌ట్లు అయింది. అయితే ప్ర‌ముఖ న్యాయ‌వాదులు చెబుతున్న ప్ర‌కారం.. న‌రేష్ ప‌థ‌కం ప్ర‌కారం కావాల‌నే ఇలా చేశార‌ని అంటున్నారు.

Pavitra Lokesh

న‌రేష్‌, ప‌విత్ర ఇద్ద‌రూ హోటల్ గ‌దిలో ఉండ‌గా.. ఆ స‌మాచారం రమ్య‌కు చేర‌వేసి త‌మ‌ను తాము ఆమెకు దొరికేలా చేసుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే రేప్పొద్దున కోర్టులో విడాకుల విష‌యానికి వ‌స్తే ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగి ఉంటే త్వ‌ర‌గా విడాకులు మంజూరు చేసే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక న‌రేష్ కావాల‌నే తాము దొరికిపోయేలా ప్లాన్ చేశార‌ని అంటున్నారు. అలాగే చ‌ట్ట ప్ర‌కారం చూసుకున్నా న‌రేష్, ప‌విత్ర‌లు అలా హోట‌ల్‌లో దొరికిపోయినా అది నేరం కాదు. ఎందుకంటే..

న్యాయ‌వాదులు చెబుతున్న ప్రకారం.. ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టాల ప్ర‌కారం.. ఒక స్త్రీ, పురుషుడు మేజ‌ర్లు అయితే వారికి పెళ్లి అయినా.. కాక‌పోయినా.. ఇద్ద‌రి అంగీకారం ఉంటే శృంగారంలో పాల్గొన‌వ‌చ్చు. క‌ల‌సి ఉండ‌వ‌చ్చు. ఇది త‌ప్పు కాదు. వారిని త‌ప్పుప‌ట్ట‌కూడ‌దు. గ‌తంలో అయితే ఇలా చేస్తే దానికి వ్య‌భిచారం కేసు పెట్టి 3 ఏళ్లు జైలులో వేసేవారు. కానీ సుప్రీం కోర్టు స్త్రీల‌కు స్వేచ్ఛ‌ను క‌ల్పించాల‌నే ఉద్దేశంతో గ‌తంలోనే ఈ త‌ర‌హా కేసుల‌కు మార్పులు చేసింది.

స్త్రీ, పురుషులు ఇద్ద‌రూ మేజ‌ర్లు అయి ఉండి వారి ప‌ర‌స్ప‌ర అంగీకారం ఉంటే అప్పుడు వారు శృంగారంలో పాల్గొన్నా అది వ్య‌భిచారం కాద‌ని తెలియ‌జేసింది. క‌నుక న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌ల విష‌యంలో ఇది వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. క‌నుక‌నే వారిపై ర‌మ్య కేసు పెట్ట‌లేక‌పోయింది. దీన్ని ఆస‌రాగా చేసుకునే న‌రేష్ ఈ విధంగా చేశార‌ని.. దీంతో ర‌మ్య‌తో విడాకులు తీసుకోవ‌డం మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంద‌ని అంటున్నారు. క‌నుక‌నే న‌రేష్ అలా చేశాడ‌ని లాయ‌ర్లు చెబుతున్నారు. ఇక వీరి వ్య‌వ‌హారం చివ‌ర‌కు ఎలా ముగుస్తుందో చూడాలి.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM