Pavitra Lokesh : గత కొద్ది రోజుల కిందట నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరూ కలసి మైసూర్‌లోని ఓ హోటల్‌లో ఉండగా.. వారు నరేష్ భార్య రమ్య రఘుపతికి అడ్డంగా దొరికిపోయారు కదా.. ఈ వార్త సంచలనం సృష్టించింది. రమ్య వారిద్దరినీ అక్కడే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారు గదిలోంచి బయటకు వస్తుండగా.. ఆమె పవిత్రను చెప్పుతో కొట్టబోయింది. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. తరువాత నరేష్.. పవిత్రతో కలిసి అక్కడి నుంచి విజిల్స్ వేస్తూ వెళ్లిపోయారు.
ఆ తరువాత పరిణామాలు మరింత సీరియస్ అయ్యాయి. తన భర్త నరేష్‌ను దక్కించుకుంటానని, పవిత్ర తమ కాపురంలో చిచ్చు పెట్టిందని.. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని.. రమ్య తెలియజేసింది. ఇక నరేష్, పవిత్ర ఇద్దరూ తాము సహజీవనం చేస్తున్నామనే విషయాన్ని అంగీకరించారు. అలాగే త్వరలో పెళ్లి చేసుకుంటాం.. అని కూడా ప్రకటన చేశారు. ఈ క్రమంలో వీరి వ్యవహారం మరో మలుపు తిరిగినట్లు అయింది. అయితే ప్రముఖ న్యాయవాదులు చెబుతున్న ప్రకారం.. నరేష్ పథకం ప్రకారం కావాలనే ఇలా చేశారని అంటున్నారు.

నరేష్, పవిత్ర ఇద్దరూ హోటల్ గదిలో ఉండగా.. ఆ సమాచారం రమ్యకు చేరవేసి తమను తాము ఆమెకు దొరికేలా చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రేప్పొద్దున కోర్టులో విడాకుల విషయానికి వస్తే ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే త్వరగా విడాకులు మంజూరు చేసే అవకాశాలు ఉంటాయి. కనుక నరేష్ కావాలనే తాము దొరికిపోయేలా ప్లాన్ చేశారని అంటున్నారు. అలాగే చట్ట ప్రకారం చూసుకున్నా నరేష్, పవిత్రలు అలా హోటల్‌లో దొరికిపోయినా అది నేరం కాదు. ఎందుకంటే..
న్యాయవాదులు చెబుతున్న ప్రకారం.. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం.. ఒక స్త్రీ, పురుషుడు మేజర్లు అయితే వారికి పెళ్లి అయినా.. కాకపోయినా.. ఇద్దరి అంగీకారం ఉంటే శృంగారంలో పాల్గొనవచ్చు. కలసి ఉండవచ్చు. ఇది తప్పు కాదు. వారిని తప్పుపట్టకూడదు. గతంలో అయితే ఇలా చేస్తే దానికి వ్యభిచారం కేసు పెట్టి 3 ఏళ్లు జైలులో వేసేవారు. కానీ సుప్రీం కోర్టు స్త్రీలకు స్వేచ్ఛను కల్పించాలనే ఉద్దేశంతో గతంలోనే ఈ తరహా కేసులకు మార్పులు చేసింది.
స్త్రీ, పురుషులు ఇద్దరూ మేజర్లు అయి ఉండి వారి పరస్పర అంగీకారం ఉంటే అప్పుడు వారు శృంగారంలో పాల్గొన్నా అది వ్యభిచారం కాదని తెలియజేసింది. కనుక నరేష్, పవిత్ర లోకేష్‌ల విషయంలో ఇది వర్తిస్తుందని చెప్పవచ్చు. కనుకనే వారిపై రమ్య కేసు పెట్టలేకపోయింది. దీన్ని ఆసరాగా చేసుకునే నరేష్ ఈ విధంగా చేశారని.. దీంతో రమ్యతో విడాకులు తీసుకోవడం మరింత సులభతరం అవుతుందని అంటున్నారు. కనుకనే నరేష్ అలా చేశాడని లాయర్లు చెబుతున్నారు. ఇక వీరి వ్యవహారం చివరకు ఎలా ముగుస్తుందో చూడాలి.