Pavitra Lokesh : సీనియర్ నటుడు నరేష్ పర్సనల్ టాపిక్ ఇప్పుడు పబ్లిక్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నటుడు నరేష్ నాలుగో పెళ్ళి.. ఇటు తెలుగు నాట, అటు కన్నడ చిత్రసీమలో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. ఇటు నరేష్, అటు పవిత్ర.. మధ్యలో నరేష్ మూడో భార్య రమ్య, పవిత్ర సహచరుడు సుచేంద్ర. గత కొన్ని రోజులుగా వీళ్ల డేటింగ్ మ్యాటర్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో తెలిసిందే. పవిత్రకు ఆల్ రెడీ పెళ్లి అయి పిల్లలు ఉన్నారు. కానీ నరేష్ దగ్గర ఉండే డబ్బు మోజులో పడి.. భర్త.. పిలల్ని దూరం చేసుకుంది.
ఇక నరేష్ గురించి అయితే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిలు చేసుకుని.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రోల్ అవుతున్నాడు. ఇలాంటి టైంలోనే నరేష్-పవిత్రా లోకేష్ మధ్య ఉన్న సీక్రేట్ రిలేషన్ షిప్ బయటపడింది. అయితే.. వాళ్ళకి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. జస్ట్ లివింగ్ రిలేషన్ షిప్ లోనే ఉన్నాం అంటూ పెద్ద బాంబ్ పేల్చారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

వీళ్లది అగ్రిమెంట్ డేటింగ్ అంటూ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం నరేష్, పవిత్ర లోకేష్ కు నెలకు రూ.25 లక్షలు డబ్బులు ఇవ్వాలి అని. ఎప్పుడైనా ఆమెను వదిలేసినా.. వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నా.. ఆమెకు రూ.50 కోట్లు ఇవ్వాలి అని అగ్రిమెంట్ రాయించుకున్నారట. నరేష్ నెలకి రూ.25 లక్షలు కేవలం తన ప్రియురాలి కోసం వెచ్చించడం అంటే అసలు నమ్మశక్యం కాని విషయం అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా ఇలాంటి గాసిప్స్ మాత్రం నెటిజన్లకు మంచి టైం పాస్ ను అందిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.