Over Sweating : చెమ‌ట అధికంగా ప‌డుతుందా.. అయితే జాగ్ర‌త్త‌..!

Over Sweating : మారుతున్న జీవనశైలి, ఆధునిక ఆహారపు అలవాట్లు, పోటీ ప్రపంచంతో ఉరుకలు పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన వంటి అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఈ అనారోగ్య సమస్యలతో కొన్ని లక్షణాలు బయటపడుతున్నాయి. ఇందులో కొన్ని సాధారణ లక్షణాలే అయినా కొన్ని మాత్రం ప్రమాదకర వ్యాధులకు సంకేతాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడు కూడా మనకు ఎదురయ్యే అన్ని లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదు.

శరీరానికి చెమట పట్టడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒంట్లోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి, శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించడానికి చెమట పట్టడం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ కొన్నిసార్లు శరీరానికి అధికంగా చెమటపట్టి మహా ఇబ్బంది పెడుతుంది. ఈ లక్షణం అనేది శరీరంలో అంతర్గతంగా జరిగే మార్పుల వల్ల కావచ్చు.

స్త్రీ 40 లేదా 50 ఏళ్ళకు చేరుకున్నప్పుడు పునరుత్పత్తి హార్మోన్స్ క్షీణించడం మొదలవుతుంది. ఋతుక్రమం ఆగి పోవడానికి సంకేతంగా రాత్రి నిద్రపోయే సమయంలో అధిక చెమట పట్టడం అనే సమస్య ఎదురవ్వొచ్చు. మీరు ఏదైనా విషయంపై ఎక్కువగా ఆందోళన, మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నా కూడా అధిక చెమట సమస్య ఎదురవుతుంది.

క్షయ వ్యాధి ఉన్నవారికి కూడా రాత్రి పూట ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. ఆప్టియోమైలిటిస్, ఎండో కార్డిటిస్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ ఉన్నవారికి కూడా రాత్రి సమయంలో చెమటలు అధికంగా వస్తుంటాయి.  మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే లింఫోమా వంటి కొన్ని క్యాన్సర్ వ్యాదులకు చెమటలు పట్టడం అనేది ప్రారంభ లక్షణం. అధిక జ్వరం వచ్చిన సమయంలో ఆస్పిరిన్, ఎసిటమినోపైన్ వంటి జ్వరాన్ని తగ్గించే మాత్రలతో కూడా చెమటలు పడతాయి. ఆరోగ్యానికి ప్రతికూలంగా నిద్రా సమయాన్ని మార్పులు చేసుకునే పరిస్థితులలో కూడా అధిక చెమట సమస్య ఎదురవుతుంది.

Share
Mounika

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM