OTT Apps : నాలుగు డబ్బులు వస్తాయంటే సమాజంలో కొందరు ఏం చేయడానికైనా వెనుకాడరు. అలాంటి వారు చాలా మందే ఉన్నారు. కానీ తాజాగా ఓటీటీ యాప్స్ కూడా ఇదే కోవకు చెందుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే.. కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి.. సిరీస్ లు ఉన్నాయి.. ఫీజు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోండి.. వాటిని చూసి ఎంజాయ్ చేయండి.. అని అదేపనిగా యాడ్స్ ఇస్తుంటారు. అంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 పుణ్యమా అని కాసులకు కక్కుర్తి పడి.. ఠాఠ్.. ఈ సినిమాలు చూడాలంటే.. డబ్బులు చెల్లించాల్సిందే.. అంటున్నాయి. మరి ఇదేమిటి ? అంత డబ్బు చెల్లించి నెలకో, 3 నెలలకో, ఏడాదికో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం దేనికి ? అలా తీసుకోవాలని ప్రేక్షకుల వద్ద దేబిరించడం దేనికి ?
ఓ వైపు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే.. తీసుకున్న తరువాత.. సినిమాలను ఇలా వీడియో ఆన్ డిమాండ్ లేదా పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేయడం దేనికి ? అంత మాత్రానికి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని చెప్పడం ఎందుకు ? సినిమాలన్నింటినీ అలా పే పర్ వ్యూ పద్ధతిలోనే ఓటీటీల్లో రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా. ఇది నిజంగానే ఒక రకమైన దోపిడీ అన్న భావన ప్రేక్షకుల్లో కలుగుతోంది.
అసలే పెరిగిన టిక్కెట్ల ధరలతో థియేటర్లకు వెళ్లలేక ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడితే.. అక్కడ కూడా ఇలా రేట్లు పెట్టి మరీ సినిమాలను చూడాలని ఆంక్షలు పెడితే.. ఇంక వినోదం ఎక్కడి నుంచి లభిస్తుంది ? అంత మాత్రానికి తమ ఓటీటీ యాప్ లలో ఖాతాను తీసుకోవాలని ప్రచారం చేయడం ఎందుకు ? తీసుకున్నాక సినిమాలు చూడాలంటే ఇలా డబ్బులు చెల్లించాలని అడగడం దేనికి ? అంటే సినిమా పాపులర్ అయింది కనుక ప్రేక్షకుల నుంచి ఇంకొన్ని డబ్బులను పిండి వసూలు చేయాలన్నదే భావన కదా.. కనుకనే ఓటీటీ యాప్స్ ఇలా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీని వెనుక కారణాలు ఏమున్నా.. ఇప్పుడు థియేటర్లకు వచ్చిన టిక్కెట్ ధరల పెంపు సమస్య.. రేపు ఓటీటీలకు కూడా వస్తుంది. వాటిని చూడడం కూడా ప్రేక్షకులు మానేస్తారు. దీనిపై ఓటీటీ యాప్స్ పునరాలోచన చేసుకుంటే మంచిది. లేదంటే మొదటికే మోసం వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…