Pawan Kalyan : పవన్ కల్యాణ్, భూమికలు హీరో హీరోయిన్లుగా 2001లో వచ్చిన ఖుషి చిత్రం అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎస్‌జే సూర్య తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ పాటలు అంటే ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తిగా వింటూనే ఉంటారు. ఇక ఈ మూవీ పవన్ కెరీర్‌లోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఇదే మూవీ టైటిల్‌తో విజయ్ దేవర కొండ, సమంత హీరో హీరోయిన్లుగా తాజాగా ఒక చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. అయితే పవన్ చిత్ర టైటిల్ ను వాడుకోవడమే కాక.. ఆ చిత్రాన్ని అవమానపరిచేలా విజయ్, సమంతలు వ్యవహరించారంటూ.. పవన్ ఫ్యాన్స్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ, సమంతలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం.. ఖుషి. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆర్మీ, మంచు కొండలు ఉంటాయి. దీంతో ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కతుందని తెలుస్తోంది. అయితే ఈ ఫస్ట్ లుక్‌లో విజయ్, సమంత చూసేందుకు ఎబ్బెట్టుగా ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్, సమంతలు పవన్ సినిమా టైటిల్‌ను వాడుకోవడమే కాక.. అంతటి గొప్ప చిత్రాన్ని అవమాన పరిచేలా దుస్తులు ధరించారని.. ఫస్ట్ లుక్ అసలు ఏమీ బాగాలేదని.. ఆరోపిస్తూ పవన్ ఫ్యాన్స్ వారిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక విజయ్, సమంతల ఖుషి చిత్రాన్ని.. నిన్ను కోరి, మజిలీ సినిమాల ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా.. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. డిసెంబర్ 23వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…