Chiranjeevi : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఇంతటి క్రేజ్ రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారనే విషయం అందరికీ తెలిసిందే. కెరీర్ మొదట్నుండి ఇప్పటివరకు ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకున్నారు. తనకు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఇంతటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. స్వయంకృషితో ఉన్నతంగా ఎదిగిన ఘనత చిరంజీవికే దక్కుతుంది. తాను సెలెక్ట్ చేసుకున్న పాత్ర ఎలాంటిదైనా.. ఎంత కఠినంగా ఉన్నా ఆ పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిందే.
అంతటి హార్డ్ వర్క్ చేశారు కనుకే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మెగాస్టార్ గా నిలిచారు. అంతకు మించిన స్టార్ డమ్ తెచ్చుకున్నారు. అలాంటి మెగాస్టార్ ను ఓ హీరోయిన్ చెంపదెబ్బ కొట్టింది. అలా కొట్టడంతో చిరు చెంప వాచిపోయింది. రాధిక హీరోయిన్ గా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన న్యాయం కావాలి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి.. రాధికను మోసం చేసే పాత్రలో నటించారు. అలా ఓ సందర్భంలో చిరంజీవిని చెంపపై కొట్టాల్సి వస్తుంది. ఆ సమయంలో రాధిక.. చిరంజీవిని కాస్త గట్టిగా కొట్టారట.
ఈ సీన్ లో రాధిక అభ్యంతరం తెలిపినా.. సీన్ రియాలిటీ కోసం ఇలా చేయాల్సిందేనని చిరంజీవి పట్టు పట్టారట. అందుకే రాధిక అంత గట్టిగా కొట్టడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి చెంప దెబ్బకి వాచిపోయిందట. దాంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ఏది ఏమైనా చిరంజీవి డెడికేషన్ కి అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు. అందుకే చిరంజీవికి అభిమానుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత చిరు సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో తన పాత్ర కోసం ఎన్నో రియల్ సంఘటనల్ని ఎదుర్కొన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…